2022 సెకండ్ హాఫ్‌ కూడా పూర్తి కావడానికి మూడు నెలలు మాత్రమే టైమ్ ఉంది. దీంతో రిలీజ్ డేట్స్ తో టాలీవుడ్ లో కొత్త జోష్ కనిపిస్తోంది. సక్సెస్ రేట్ చాలా తగ్గినా రిలీజ్ డేట్స్ మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే రెండు మూడు నెలల ముందే రిలీజ్ డేట్స్ ను అనౌన్స్ చేస్తున్నారు. డిసెంబర్ లో ఫస్ట్ వీక్ లో ఓ క్రేజీ బాక్సాఫీస్ ఫైట్ జరగబోతోంది. ఈ ఇద్దరూ ఖచ్చితంగా హిట్ కొడతాం సార్ అంటున్నారు. మరి ఈ క్రేజీ క్లాష్‌ ఇప్పుడు టాక్ ఆఫ్‌ ద టాలీవుడ్ గా మారింది. అందుకు కారణం ఈ ఇద్దరూ ప్యాన్ ఇండియన్ ఇమేజ్ ఉన్న స్టార్సే కావడం.మోస్ట్ టాలెంటెడ్ వెర్సటైల్ యాక్టర్ ధనుష్ సినిమా సార్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తోన్న చిత్రం ఇది. ధనుష్ చేస్తోన్న ఫస్ట్ తెలుగు మూవీ కూడా.

రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపే కంటెంట్ కనిపిస్తోంది. ధనుష్ ఎంచుకునే కథల్లో ఓ ప్రత్యేకత కనిపిస్తుంది. ఆ స్పెషాలిటీ ఈ టీజర్ లోనూ ఉంది. సార్ చిత్రాన్ని డిసెంబర్ 2న విడుదల చేయబోతున్నట్టు లేటెస్ట్ గా అనౌన్స్ చేశారు.డిసెంబర్ 2న సార్ క్లాస్ లు మొదలవుతాయి అని చెప్పడానికి ముందే అడవి శేష్‌ హీరోగా రూపొందిన హిట్2 మూవీని కూడా అదే రోజు విడుదల చేస్తాం అని రీసెంట్ గా అనౌన్స్ చేశారు. నాని నిర్మించిన ఈ హిట్ 2 చిత్రానికి డాక్టర్ శైలేష్ దర్శకుడు. ఇంతకు ముందు విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన హిట్ మూవీకి కొనసాగింపు ఇది. మేజర్ తర్వాత అడవి శేష్‌ కు ప్యాన్ ఇండియన్ రేంజ్ లో క్రేజ్ వచ్చింది. ఇటు ధనుష్ కు ఆ ఇమేజ్ ఎప్పుడో వచ్చింది. ఇద్దరూ మల్టీ టాలెంటెడే. మరి ఒకే రోజు బాక్సాఫీస్ వార్ కు సిద్ధమైన వీరిలో గెలుపెవరిదో చూడాలి.

, , , ,