పువ్వులు, పండ్లల్లో పెట్టి చూసుకున్న దర్శకుడు మీరు.. రాఘవేంద్రరావుని చిరు పొగిడాడా? తిట్టాడా?

పువ్వులు, పండ్లల్లో పెట్టి చూసుకున్న దర్శకుడు మీరు.. రాఘవేంద్రరావుని చిరు పొగిడాడా? తిట్టాడా?

చిరంజీవి హీరోగా, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1992లో రూపొందిన చిత్రం `ఘరానామోగుడు`. ఇది నిన్నటితో 28ఏండ్లు పూర్తి చేసుకుంది.  అంతేకాదు అప్పట్లోనే కలెక్షన్ల వర్షం కురిపించింది. పది కోట్ల కలెన్లని వసూలు చేసిన తొలి చిత్రంగా నిలిచింది. ఇది ఇరవైఎనిమిదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా అటు దర్శకుడు రాఘవేంద్రరావు, ఇటు చిరు తమ ఆనందాన్నిపంచుకున్నారు. సోషల్‌ మీడియా వేదికగా వరుసగా ఆసక్తికర ట్వీట్లు చేసుకున్నారు. మొదటగా చిత్ర పోస్టర్‌ని, చిరుతో ఉన్న లోకేషన్‌ ఫోటోని పంచుకుంటూ దర్శకుడు రాఘవేంద్రరావు ఓ ట్వీట్‌ చేశారు. `కాలం వేగంగా గడిచిపోతున్నప్పటికీ నా బాబాయ్‌తో కలిసి ఈ సినిమా చిత్రీకరించిన రోజులు ఎప్పటికీ నాకు గుర్తుండిపోతాయి. ఇది ఒక మెగా స్పెషల్‌ ఫిల్మ్. ఇదొక మైలురాయి లాంటి చిత్రం. ఈ సినిమా 28ఏళ్లు పూర్తి చేసుకుంది. నిర్మాత దేవి వరప్రసాద్‌, సంగీత దర్శకుడు కీరవాణి, చిత్ర బృందానికి థ్యాంక్స్ ` అంటూ రాఘవేంద్రరావు ట్వీట్‌ చేశారు. దీనికి చిరు ప్రతిస్పందించారు. “ఘరానామొగుడు` సృషించిన ఘనతే మీదే రాఘవేంద్రరావుగారు. ఈ చిత్రం సృష్టించిన రికార్డుల కంటే మీతో పనిచేసిన ప్రతి రోజూ నాకు మంచి జ్ఞాపకం. నటీనటులను పువ్వుల్లో, ఒక్కోసారి పళ్లల్లో పెట్టిచూసుకుంటూ మంచి ఫలితాన్నిరాబట్టుకున్న ఘరానా దర్శకుడు మీరు. కీరవాణి, నిర్మాత దేవివరప్రసాద్‌ ఈ విజయానికి మూల స్తంభాలు` అని చిరు తెలిపారు. అయితే రాఘవేంద్రరావు పాటల్లో హీరోయిన్లపై పువ్వులు, పండ్లు వేయడం ఆయన స్టయిల్‌. వాటిని దృష్టిలోపెట్టుకుని పువ్వులు, పళ్ళు ని గుర్తు చేయడం పట్ల ఇంతకి రాఘవేంద్రరావుని చిరు పొగిడాడా? తిట్టడా? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. నేటిజన్లు మాత్రం చిరు సెటైర్లు సూపర్‌ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published.