పన్నెండేళ్ళ తర్వాత మాస్‌రాజాతో త్రిష రొమాన్స్ ?

పన్నెండేళ్ళ తర్వాత మాస్‌రాజాతో త్రిష రొమాన్స్ ?

మాస్‌ మహారాజా రవితేజ, త్రిష జంటగా `కృష్ణ` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2008లో విడుదలై పెద్ద హిట్‌గా నిలిచింది. దాదాపు 12ఏళ్ళ తర్వాత మరోసారి వీరిద్దరు జోడి కట్టబోతున్నారు. రమేష్‌ వర్మ దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఇందులో ఇద్దరు హీరోయిన్లకు స్కోప్‌ ఉందని, అందులో ఇప్పటికే ఓ భామగా నిధి అగర్వాల్‌ ఎంపికైన విషయం తెలిసిందే. మరో హీరోయిన్‌గా `వర్షం` భామ త్రిషని ఫైనల్‌ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇంకో కథానాయికగా `నేలటికెట్టు` ఫేమ్‌ మాళవిక వర్మ పేరు వినిపించింది. కానీ ఆమె స్థానంలో త్రిషని ఫైనల్‌ చేసినట్టు తెలుస్తుంది. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు, స్ట్రాంగ్‌ రోల్స్ కే ప్రయారిటీ ఇస్తున్న త్రిష, రవితేజ సినిమాకి నిజంగానే ఒప్పుకుందా అన్నది సస్పెన్స్ గా మారింది. అంతేకాదు `కృష్ణ` సినిమా షూటింగ్‌ టైమ్‌లో తాను ఎదుర్కొన పలు సంఘటనల కారణంగా ఆమె మళ్ళీ రవితేజతో నటించేందుకు ఒప్పుకోలేదన్నారు. మరి మరోసారి రవితేజతో జోడి కట్టబోతున్నట్టు వస్తోన్న వార్తల్లో నిజం ఎంతనేది చూడాలి. ఈ అమ్మడు ప్రస్తుతం తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉంది. అందులో `పరమపధమ్‌ విలయట్టు`, గర్జనై`, `రాంగి`, `సుగర్‌`, `పొన్నియిన్‌ సెల్వన్‌`తోపాటు మలయాళంలో `రామ్‌` వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. ఇక ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేయనున్నారట. ఓ పాత్రలో సీఏగా, మరో పాత్రలో ఎన్‌ఆర్‌ఐ బిజినెస్‌ మేన్‌గా కనిపిస్తారని తెలుస్తుంది. సీఏ పాత్ర చాలా మాస్‌గా, రవితేజ స్టయిల్‌ ఎనర్జీని మించి ఉంటుందని తెలుస్తుంది. 

Leave a Reply

Your email address will not be published.