ad

వదిలిన మాట వెనక్కి రాదు. దాని పర్యవసానాలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటేనే అలాంటి మాటలు వదలాలి. ప్రస్తుతం ఆగస్ట్ నెలంతా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ప్రతి వారం మీడియం రేంజ్ హీరోల సినిమాలు రెండు మూడు వస్తున్నాయి. ఈ క్రమంలో ఒకరిని మించి ఒకరు ప్రమోషన్స్ చేస్తూ ఆడియన్స్ లో ఎక్కువ క్రేజ్ పెంచుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు. ఈ ప్రయత్నంలో సినిమాలోని మెయిన్ టీమ్ ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతుంది. పెట్టాలి కూడా. బట్ కొన్నిసార్లు కొందరికి కుదరదు. ఆ విషయం వారినే అడిగితే ఓ క్లారిటీ వస్తుంది. కాదూ అని కౌంటర్ వేస్తే దానికి ఎన్ కౌంటర్ కూడా పడుతుంది. ప్రస్తుతం నిఖిల్ పరిస్థితి ఇదే.
నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా కార్తికేయ2. చందు మొండేటి డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని అభిషేక్ నామా నిర్మించాడు. ఈ నెల 12న కార్తికేయ2 విడుదల కాబోతోంది. అదే టైమ్ కు నితిన్ మాచర్ల నియోజకవర్గంతో పాటు ఆ ముందు రోజే లాల్ సింగ్ చడ్డా, కుదిరితే సమంత నటించిన యశోద కూడా వస్తుంది. 13న బెల్లంకొండ సురేష్‌ రెండో కొడుకు నటించిన స్వాతిముత్యం సినిమా కూడా ఉందన్నారు. స్వాతిముత్యం, యశోద డౌటే కానీ.. మిగతా రెండు సినిమాలతో నిఖిల్ కు పోటీ తప్పదు. ఈ పోటీలో తనే గెలిచేందుకు ప్రమోషన్స్ హడావిడీగా చేస్తున్నాడు. అయితే అతనితో పాటు రావాల్సిన అనుపమ రావడం లేదు. దీంతో రీసెంట్ గా అనుపమ సెట్స్ లో ఉంటే ఉదయం 5గంటలకు షాట్ అన్నా రెడీ అవుతుంది. కానీ ప్రమోషన్స అంటే మాత్రం రాదు అంటూ కౌంటర్ వేశాడు. ఈ కౌంటర్ కాసేపట్లోనే వైరల్ అయింది. దీంతో దీనికి ఎన్ కౌంటర్ లాంటి ఆన్సర్ ఇచ్చింది అనుపమ.
“హే అందరికీ.. కార్తికేయ2 ప్రమోషన్స్ విషయంలో అందరికీ ఓ క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఎందుకు రాలేకపోతున్నానంటే ఆల్రెడీ ఒప్పుకున్న రెండు సినిమాల షూటింగ్స్ లో డే అండ్ నైట్ బిజీగా ఉంటున్నాను. ఇవన్నీ మిగతా ఆర్టిస్టుల కాంబినేషన్స్ లో ఉన్నాయి. అందుకే డేట్స్ లో అనుకోని క్లాషెస్ వచ్చాయి. పైగా కార్తికేయ2 రిలీజ్ డేట్(మొదట ఈ నెల 5న అన్నారు. అందుకే తను వేరే డేట్స్ లో షూటింగ్ పెట్టుకుని ఉంటుంది కదా) కూడా మారడంతో నా షెడ్యూల్స్ మారాయి. అందుకే ప్రమోషన్స్ కు రాలేకపోతున్నాను. ఇది మీరంతా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇక ఈ సినిమా కోసం ఎంటైర్ టీమ్ పెడుతోన్న ఎఫర్ట్ కు అందరికీ థ్యాంక్యూ.. ” ముఖ్యంగా ఇంకా ఎక్స్ ట్రా ఎఫర్ట్స్ పెడుతోన్న నిఖిల్ గారికి” అంటూ గట్టి ఎన్ కౌంటర్ వేసింది అనుపమ.
నిజమే కదా.. సినిమా రిలీజ్ డేట్ మారినప్పుడు ఆటోమేటిక్ గా ఆమె షెడ్యూల్స్ కూడా మారతాయి. వీళ్లు మార్చుకుని తననూ మార్చమంటే .. తనేమో వేరే షూటింగ్స్ లో కాంబినేషన్స్ లో ఉన్నానంటోంది. ఈ విషయంలో ఉండే ఇబ్బందేంటో తెలిసి కూడా నిఖిల్ కౌంటర్ వేయడం ఆశ్చర్యమే. మరి ఈ “ఎక్స్ ట్రా ఎఫర్ట్”కు నిఖిల్ కౌంట్ ఎలా ఉంటుందో చూడాలి.

,