పండగ సీజన్స్ లో పెద్ద హీరోల సినిమాలు క్లాష్ అయితే నిర్మాతలకు లాస్ తప్పదు. పైగా కొన్ని రికార్డులు కూడా మిస్ అవుతాయి. అందుకే ముందుగానే ప్లాన్ చేసుకుని ఒకటీ రెండు రోజులు ముందూ వెనకా చూసుకుని వస్తుంటారు. ఇక ఈ దసరాకు వెటరన్ స్టార్స్ మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున బాక్సాఫీస్ బరిలో దిగారు. ఇద్దరూ అక్టోబర్ 5నే విడుదల అని తమ గాడ్ ఫాదర్, ఘోస్ట్ సినిమాల రిలీజ్ డేట్స్ ను అనౌన్స్ చేశారు. నిజానికి ముందుగా అనౌన్స్ చేసింది నాగార్జునే. ఆ తర్వాతే చిరంజీవి గాడ్ ఫాదర్ దసరా రిలీజ్ గా వేశారు. ఈ కారణంగానే రీసెంట్ గా చిరంజీవి డైరెక్ట్ క్లాష్ లేకుండా ఒక రోజు ముందే అంటే అక్టోబర్ 4నే తన గాడ్ ఫాదర్ ను విడుదల చేయబోతున్నాడు అనే వార్తలు వచ్చాయి.

బట్ లేటెస్ట్ గా ఈ డేట్ లో మార్పులు వచ్చాయి. ఈ సారి నాగార్జునే వెనక్కి తగ్గుతున్నాడు. అందుకు కారణం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన దసరా హాలిడేస్ లిస్ట్.నాగ్ ఘోస్ట్ చిత్రాన్ని అక్టోబర్ 5 నుంచి 7 కు పోస్ట్ పోన్ చేస్తున్నారు. అంటే ముందు చెప్పిన డేట్ కంటే రెండు రోజులు ఆలస్యంగా వస్తుందన్నమాట. గాడ్ ఫాదర్ రిలీజ్ డేట్ లో మార్పు లేదు. మెగాస్టార్ అక్టోబర్ 5నే వస్తాడు. మరి నాగ్ వెనక్కి వెళ్లడానికి కారణం దసరా హాలిడేస్ చాలా రోజులు ఉండటమే. తెలంగాణలో ఈ నెల 26 నుంచి వచ్చే నెల 10 వరకూ సెలవులున్నాయి. అందుకే నాగ్ ఆ రోజును సెలెక్ట్ చేసుకున్నాడు.

ఘోస్ట్ కు డేట్ తో పాటు వీకెండ్ కూడా కలిసి వస్తుంది. అందుకే క్లాష్‌ లేకుండా క్లాస్ గా ఇష్యూను క్లియర్ చేసుకున్నారన్నమాట.ఇక ఘోస్ట్ చిత్రాన్ని ప్రవీణ్‌ సత్తారు రూపొందించాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ మోస్ట్ ప్రామిసింగ్ గా కనిపించింది. స్టైలిష్‌ యాక్షన్ ఎంటర్టైనర్ లా ఈ చిత్రాన్ని రూపొందించాడు ప్రవీణ్. నాగ్ సరసన సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించింది. తను కూడా యాక్షన్ సీక్వెన్స్ లు చేయడం విశేషం. మొత్తంగా ఈ సారి నాగ్ ఘోస్ట్ తో బెస్ట్ హిట్ కొట్టేలానే ఉన్నాడని ఇండస్ట్రీలో కూడా చెప్పుకుంటున్నారు.

, , , , , ,