Advertisement
కమల్ హాసన్ కుమ్మేశాడుగా
Latest Movies Tollywood

కమల్ హాసన్ కుమ్మేశాడుగా

Advertisement

లోకనాయకుడుగా, నవరస నటుడుగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న నటుడు కమల్ హాసన్. ఆయన చేసినన్ని ప్రయోగాలు ప్రపంచ సినిమా చరిత్రలో మరే నటుడూ చేయలేదు. ఈయనకు ఉన్న మల్టీ టాలెంట్ కూడా మరో నటుడులో కనిపించదు. మహా నటుడుగా అందరికీ తెలిసిన ఆయన సింగర్, లిరిసిస్ట్, క్లాసికల్ డ్యాన్సర్, మ్యూజిక్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, డిస్ట్రిబ్యూటర్.. ఇలా అనేక అంశాల్లో ఆరితేరినవాడు. ఒక గెటప్ వేస్తే కమల్ కు కుదిరినట్టుగా మరొకరికి సాధ్యం కాదు. సెన్సిబుల్ ఇష్యూస్ ను కూడా అద్భుతంగా డీల్ చేసిన ఔరా అనిపించడం ఆయనకే చెల్లింది. అలాంటి నటుడు కొన్నాళ్లుగా వెనక బడ్డాడు. సక్సెస్ పరంగా ఆయన కెరీర్ లో ఇప్పుడు ‘‘చీకటి రాజ్యం’’ నడుస్తోంది. ఆ మధ్య భారతీయుడుకు సీక్వెల్ మొదలుపెట్టినా ఆగిపోయింది. అలాగే మరో సినిమా కూడా యాక్సిడెంట్, కరోనా కారణంగా ఆగిపోయింది. దీంతో లోక నాయకుడుని వెండితెరపై చూడాలనుకుంటోన్న ఆయన అభిమానుల కోరిక తీర్చేందుకు ముందుకు వచ్చాడు లేటెస్ట్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు.
కమల్, లోకేష్ కాంబోలో విక్రమ్ అనే సినిమా వస్తోంది. ఈ టైటిల్ తో మూడు దశాద్దాల క్రితం కమల్ హాసన్ ఓ సూపర్ హిట్ మూవీ చేశాడు. అందులోని టైటిల్ సాంగ్ లో ఓ పవర్ ఫుల్ స్వాగ్ ఉంటుంది. అది ఇప్పుడు కూడా రిపీట్ చేశారు. ఇక ఈ మూవీ అనౌన్స్ అయిన తర్వాత నుంచీ యాక్షన్ మూవీ అనే చెబుతున్నారు. మొదట్లోనే విడుదల చేసిన టీజర్ కు, తర్వాత వదిలిన టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇకలేటెస్ట్ గా విక్రమ్ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు.
వింటేజ్ కమల్ ను గుర్తుకు తెస్తూ.. చాలాయేళ్ల తర్వాత ఆయన ఓ ఊరమాస్ సాంగ్ లో కనిపించాడు. అనిరుధ్ రవిచంద్రన్ అందించిన మ్యూజిక్ రెగ్యులర్ గానే ఉన్నా.. మాస్ బీట్స్, అందులో కమల్ స్టెప్పులు కేక అనేలా ఉన్నాయి. విశేషం ఏంటంటే.. ఈ పాటను రాసింది, పాడింది(తమిళ్ లో) కమల్ హాసనే. తను మనసు పెట్టిపాడితే ఎంత గొప్పగా ఉంటుందో ఈ తరానికీ తెలిసేలా ఉందీ పాట. మొత్తంగా ఈ పాటతో సినిమాపై ఓ రేంజ్ లో అటెన్షన్ పెరిగిందనే చెప్పాలి.
ఇక కమల్ తో పాటుగా ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, నరైన్, గాయత్రి శంకర్, అర్జున్ దాస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జూన్ 3న విడుదల కాబోతోనన విక్రమ్ తో కమల్ హాసన్ బాక్సాఫీస్ వద్ద పరాక్రమం చూపడం ఖాయం అంటున్నారు ఆయన ఫ్యాన్స్.

Advertisement