తెలుగు సినీ పరిశ్రమ మొత్తం మీద ఎలాంటి సమస్య వచ్చినా ముందుగా గుర్తు వచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన ఆయన ఇప్పుడు సినీ పరిశ్రమ మొత్తానికి పెద్ద దిక్కుగా మారారు. తనకు ఆ “పెద్ద” అనే బాధ్యతలు వద్దు అంటూనే సినీ పరిశ్రమకు ఏ కష్టం వచ్చినా తానున్నాను తన భుజం కాస్తాను అంటూ ఆయన అన్ని విషయాల్లోనూ అండగా ఉంటూ వస్తున్నారు. మెగాస్టార్ కుర్ర హీరోలకు సైతం పోటీ ఇస్తూ తన చరిష్మాతో తెలుగు శని పరిశ్రమని ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా మెగాస్టార్ చిరంజీవి పేరు వింటేనే ఎంతోమందికి వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. సినీ పరిశ్రమలో సైతం ఎంతోమంది నటీనటులు, దర్శకులు, ఇతర టెక్నీషియన్లు మెగాస్టార్ చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకుని సినీ పరిశ్రమకు వచ్చారంటే అతిశయోక్తి కాదు. సామాన్య ప్రేక్షకులకు గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, చిరంజీవి పేరు చెబితే దేనికైనా రెడీ అనే అభిమాన గణాన్ని ఆయన సంపాదించుకున్నారు. తాజాగా సీనియర్ జర్నలిస్ట్ ప్రభు ప్రభు “శూన్యం నుంచి శిఖరాగ్రాలకు” అనే ఒక పుస్తకాన్ని రచించి మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదగా ఆవిష్కరింపజేశారు.

ఇక ఈ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరవగా ఆయనతో ఫోటోలు దిగేందుకు సెలబ్రిటీల భార్యలు సైతం ఆసక్తి చూపించడం చర్చనీయాంశమైంది. వారంతా సినీ పరిశ్రమలో దర్శకులు, నిర్మాతలు అలాగే పలువురు ఉన్నతాధికారుల భార్యలు. అయితేనేమి మెగాస్టార్ చిరంజీవి అభిమానులే. మెగాస్టార్ చిరంజీవి హాజరైన కార్యక్రమానికి తమ హాజరవుతున్నామని ఆనందంతో వచ్చిన వారందరికీ ఆయనతో ఫోటో దిగే అవకాశం వస్తే వదులుకుంటారా? వెంటనే వెళ్లి ఆయనతో ఫోటోలు దిగేందుకు ప్రయత్నించారు. మెగాస్టార్ చిరంజీవి ఎవరిని నొప్పించరు అనే విషయం మనందరికీ తెలుసు. దీంతో ఆయన కూడా ఫోటోలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.

అయితే కొద్ది రోజుల క్రితం ఇలానే తన అభిమానులకు ఫోటోలు ఇస్తుంటే గరికపాటి చేసిన కామెంట్లను గుర్తు చేసుకుంటూ ఆయన ఇక్కడ లేరు కదా అంటూ చిరు చలోక్తి విసిరారు. దీంతో ఒక్కసారిగా అక్కడ సందడి నెలకొంది. ఈ వీడియో వెంటనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆలై బలై కార్యక్రమంలో కూడా దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది అక్కడికి సామాన్యులతో పాటు ఎంతోమంది సెలబ్రిటీలు వారి భార్యలు విచ్చేశారు. ఈ నేపథ్యంలోనే వారందరూ మెగాస్టార్ చిరంజీవితో ఫోటోలు తీసుకునేందుకు ప్రయత్నిస్తే గరికపాటి నోరు జారి అభాసు పాలయ్యారు. మెగాస్టార్ వ్యక్తిత్వం ఏమిటో అప్పుడే బయట పడడంతో అందరూ మెగాస్టార్ అంటే ఇది అంటూ కొనియాడారు.

, , ,