Top
Home > ట్రెండింగ్ > బుల్లితెరపై అల వైకుంఠపురం రికార్డులు

బుల్లితెరపై అల వైకుంఠపురం రికార్డులు

బుల్లితెరపై అల వైకుంఠపురం రికార్డులు
X

ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన అల వైకుంఠపురములో బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకుందో చూశాం. అంతకు ముందే తమన్ అందించిన సాంగ్స్ తో యూ ట్యూబ్ లో ఇప్పటి వరకు తెలుగు సినిమాలు చూడని రికార్డ్స్ ని నెల కొల్పింది. ఇక రిలీజ్ తర్వాత బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి 200ల కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది...

సినిమా రిలీజై ఆరు నెలలు తర్వాత ఈ నెల 16న జెమిని టివిలో అల వైకుంఠపురములో సినిమా ఫస్ట్ టైమ్ టెలికాస్ట్ అయ్యింది. ఈ సినిమాకున్న క్రేజ్ వల్ల భారీ టిఆర్పి రేటింగ్ వచ్చింది. ఓవరాల్ రేటింగ్ 25 పాయింట్లకు పైగా సాధించగా, అర్బన్ లో 29.4 పాయింట్లకు పైగా సాధించి కొత్త రికార్డులు సృష్టించింది. గతంలో 20కి పైగా రేటింగ్ సాధించిన సినిమాలుగా ఉన్న అత్తారింటికి దారేది, బాహుబలి, శ్రీమంతుడు, సరిలేరు నీకెవ్వరూ వంటి సినిమాల రికార్డులను అల వైకుంఠపురములో సినిమా బ్రేక్ చేసింది.

Updated : 28 Aug 2020 4:48 PM GMT
Tags:    
Next Story
Share it
Top