పవన్ తో పొత్తుకు జగన్ తహతహ !

YS Jagan Interested to Combine with Pawan Kalyan

పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో తన జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారని ప్రకటించారు. తిరుపతి సభలోనూ తన పార్టీ యితర పార్టీలతో ఎలా వుండబోతోందన్నది స్పష్టం చేశారు. దీంతో ఏపీలో కొత్త పొత్తులు పొడిచే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనికి ఊతమిచ్చేలా వైసీపీ నేతల వ్యాఖ్యలున్నాయి.  కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలతో మినహా ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకునేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని  వైసీపీ నేత కన్నబాబు ప్రకటించారు.YS Jagan Interested to Combine with Pawan Kalyan

వచ్చే కార్పోరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని దెబ్బ తీయడానికి జగన్ పన్నిన వ్యూహంలో భాగంగానే కన్నబాబు ఆ విషయం చెప్పినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, టీడీపీ అని ప్రకటించిన వైసీపీ నేతలు..అటు బీజేపీకి, ఇటు పవన్ కు దారులు తెరిచే వుంచామని సంకేతాలిచ్చారు. బిజెపితో పొత్తు పెట్టుకునేందుకు  వైయస్ జగన్  ఎప్పటి నుంచో కాచుక్కూర్చున్నారు. అటు బీజేపీ అయినా ఓకే..కమలనాథులు కాదంటే కమ్యూనిస్టులైనా ఓకే..అని జగన్ ముందుగానే తన సంసిద్ధతను ప్రకటించారని వూహిస్తున్నారు.

పవన్ కల్యాణ్ అటు బీజేపీతో దోస్తీ వుంది. ఇటు కమ్యూనిస్టులంటే తనకు సానుభూతి అని చెప్పకనే చెప్పాడు. అందువల్ల ఆ రెండు పార్టీల్లో ఎవరితో పవన్ జట్టు కట్టినా, తీవ్రంగా దెబ్బతినేది తానేనని జగన్ కు తెలుసు. అందుకే ముందే పొత్తు కోకిల కూసేసింది. పవన్ కంటే ముందుగానే బీజేపీపైనో, కమ్యూనిస్టులపైనో కర్చీఫ్ వేసేయాలని జగన్ తొందరపడుతున్నారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికలకు పొత్తులు ఎలా వుంటాయో గానీ..యిప్పటి నుంచే ఎత్తులపై పై ఎత్తులు మాత్రం జోరుగా సాగుతున్నాయి.

Leave a Reply

*