జ‌గ‌న్‌కి షాక్‌.. వైఎస్సార్‌సీ నుంచి మ‌రో ఇద్ద‌రు ఎమ్మెల్యేలు జంప్‌…!

దొరికిన వారిని తురుముదాం… దొర‌కని వారిని త‌రుముదాం.. ఇంకా బాల‌కృష్ణ ప్ర‌తిష్టాత్మ‌క సినిమాలోని పేలిపోతున్న డైలాగ్ ఇది. ఏపీలో ఇప్పుడు టీడీపీ ఇదే వైఖ‌రిని అవ‌లంభిస్తోంది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన వైసీపీపై సేమ్ టూ సేమ్ ఇదే డైలాగ్‌ను ప్ర‌త్య‌క్షంగా ప్ర‌యోగిస్తోంది.వ‌చ్చిన వారిని పార్టీలో చేర్చుకుందాం… రాని వారిని వెంటాడ‌దాం.. ఏదేమైనా జ‌గ‌న్‌ను ఒంట‌రి చేద్దాం.

వైసీపీ ఎమ్మెల్యేల విష‌యంలో అధికార టీడీపీ వైఖ‌రి ఇది. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ పేరిట ఇప్ప‌టికే డ‌జ‌నుకు పైగా ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. దాంతో జ‌గ‌న్ డైల‌మాలో ప‌డిపోయారు. పార్టీ నుంచి ఎవ‌రు ఎప్పుడు బ‌య‌ట‌కు వెళ్లిపోతారో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. స‌భ‌లో వైసీపీ ప‌క్ష ఉప‌నేత జ్యోతుల నెహ్రు, భూమా నాగిరెడ్డి… నిన్న‌టికి నిన్న ఉప్పులేటి క‌ల్ప‌న ఇలా వైసీప‌లో కీల‌క‌మైన నేత‌లంతా టీడీపీ ప‌క్షాన చేరి జ‌గ‌న్‌కు కోలుకోలేని దెబ్బ కొట్టారు. ఇప్పుడిక నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కాకాని గోవ‌ర్ద‌న్ రెడ్డి వంతు వ‌చ్చింది.

జిల్లాలోని టీడీపీ సీనియ‌ర్ నేత సోమిరెడ్డిపై కాకాని తీవ్ర‌మైన వ్యాఖ్య‌లు చేసి ఇప్పుడు ఇరుక్కున్నారు. అక్ర‌మాస్తులంటూ త‌మ సీనియ‌ర్ నేత‌పై ఆరోప‌ణ‌లు చేయడాన్ని టీడీపీ అంత తేలిగ్గా తీసుకోలేదు. వెంట‌నే సీఐడీ రంగంలోకి దిగింది. కాకాని స‌హా కావ‌లి ఎమ్మెల్యేపై ఉన్న గ‌త ఎన్నిక‌ల నాటి క‌ల్తీ మ‌ద్యం కేసును బ‌య‌ట‌కు తీసింది. ఆ ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌పై చార్జిషీట్ వేసింది. ఈ కేసు తేలితే జ‌గ‌న్ ద‌గ్గ‌ర మిగిలిన వారిలో మ‌రో ఇద్ద‌రు ఎమ్మెల్యేలపై దెబ్బ ప‌డిన‌ట్లే.

Leave a Reply

*