టీడీపీలోకి దాస‌రి… రాయ‌బారం పంపిన చంద్ర‌బాబు….!

దాస‌రి నారాయ‌ణ‌రావు… టీడీపీకి బ‌ద్ధ వ్య‌తిరేకి. కానీ, ఎన్టీఆర్‌కి రాజ‌కీయ బాట వేసిన వ్య‌క్తుల‌లో ఆయ‌న ఒక‌రు. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన కొన్ని సాంఘిక సినిమాలు ఎన్టీఆర్ క్రేజ్‌ని బాగా పెంచాయి. ఆ త‌ర‌వాత ఏం జ‌రిగిందో ఏమో.. దాసరి నారాయ‌ణ‌రావు మాత్రం త‌న పొలిటిక‌ల్ కెరీర్‌కి వేదిక‌గా కాంగ్రెస్‌ని ఎంచుకున్నారు. టీడీపీకి దూరంగా ఉన్నారు. యూపీఏ హ‌యాంలో ఆయ‌న కేంద్ర‌ మంత్రిగా కూడా పనిచేశారు.

ఇటీవ‌ల మారిన రాజ‌కీయ ప‌రిణామాల‌లో దాసరి వైఎస్సార్‌సీకి ద‌గ్గ‌ర‌గా ఉంటున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతేకాదు, ఆయ‌న ద‌గ్గ‌ర‌కు వైఎస్సార్‌సీపీ అధినేత జ‌గ‌న్ కూడా వ‌చ్చి స్పెష‌ల్‌గా క‌లిశారు. దీంతో, దాస‌రి ఆ పార్టీ తీర్ధం పుచ్చుకుంటార‌నే విశ్లేష‌ణ‌లు జ‌రిగాయి. కానీ, ఆయ‌న వైఎస్సార్‌సీలో చేర‌క‌పోయినా, టీడీపీకి దూరంగా ఉంటున్నారు.

అలాంటి దాసరిని ఇవాళ టీడీపీ నేత‌లు విజ‌య‌వాడ‌లో క‌ల‌వ‌డం రాజ‌కీయ వ‌ర్గాల‌లో సంచ‌ల‌నంగా మారింది. వైఎస్సార్‌సీ నుంచి టీడీపీలో జాయిన్ అయిన జ‌లీల్ ఖాన్‌తోపాటు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న దాస‌రితో భేటీ అయ్యారు. ఆయ‌న‌ను టీడీపీలోకి ఆహ్వానించేందుకే అంటూ కొంద‌రు అప్పుడే సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేశారు. మ‌రికొంద‌రు మాత్రం అలాంటిదేమీ లేద‌ని, ఇవాళ ఖైదీ నెంబ‌ర్ 150 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయ‌న చెయ్య‌బోయే ప్ర‌సంగంలో సంచ‌ల‌నాలు ఉండ‌బోతున్నాయ‌ని ముందే తెలిసి మీట్ అయ్యార‌ని చెబుతున్నారు. కానీ, దీనిపై ఎక్కడా ఎలాంటి లీక్‌లు లేవు. మ‌రి, దాస‌రిని టీడీపీ నేత‌లు ఎందుకు క‌లిసిన‌ట్టు..? త‌్వర‌లోనే అస‌లు సీక్రెట్ రివీల్ అవుతుందా…?

Leave a Reply

*