అన్నా మీరొస్తే…. తెలంగాణ‌లో మ‌న‌దే అధికారం… రేవంత్ రెడ్డి….!

తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్షంగా కూడా నిల‌వ‌లేక‌పోయిన పార్టీ టీడీపీ. గెలిచిన ఎమ్మెల్యేలంతా అధికార పార్టీలోకి జంప్ చేయ‌డంతో కేవ‌లం క్యాడ‌ర్‌తో మిగిలిన పార్టీ తెలుగుదేశం. ఉన్న ఒక‌రిద్ద‌రు నాయ‌కుల‌తో కునారిల్లుతున్న పార్టీ కూడా టీడీపీనే. అలాంటి టీడీపీ వ‌చ్చే ఎన్నిక‌ల‌లో అధికారం మ‌న‌దే అని ధీమా వ్య‌క్తం చేస్తోంది. 2019లో అధికారం చేప‌ట్ట‌డం ఖాయ‌మ‌ని ఆ పార్టీ నేత‌లు చెబుతున్నారు.

గ‌త ఎన్నిక‌ల‌లో టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో 90 శాతం మంది అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇందులో టీడీపీ అంటే ప్రాణమిచ్చే నేత‌లు కూడా ఉన్నారు. ఇక‌, రేవంత్ రెడ్డి, సండ్ర వెంక‌ట వీర‌య్య‌, ఆర్‌.కృష్ణ‌య్య మాత్ర‌మే టీడీపీలో మిగిలిన ఎమ్మెల్యేలు. వాళ్ల‌లో కృష్ణ‌య్య‌ది భిన్న‌మైన దారి. ఇక‌, మిగిలింది రేవంత్‌, సండ్ర‌. పార్టీని భుజాన వేసుకుని మోస్తున్న రేవంత్ ఇప్పుడు స‌భ‌లోనూ…. బ‌య‌టా అధికార పార్టీపై పోరాడుతున్నారు.

రేవంత్ శుక్ర‌వారం అసెంబ్లీలో త‌మ పార్టీ పూర్వ నేత ప్ర‌స్తుత అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుల‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక క‌లిగించాయి. లాబీల్లో రేవంత్‌కు ఎర్ర‌బెల్లి, అరికెపూడి గాంధీ ఎదురుప‌డ్డారు. దాంతో రేవంత్‌… అన్నా మీరు.. మిగ‌తా 11 మంది తిరిగి వ‌చ్చేస్తే… క‌లిసి పోరాడుదాం. మ‌న‌దే అధికారం అని న‌వ్వుతూ అన్నారు. దానికి వారిద్ద‌రూ న‌వ్వులు చిందిస్తూ వెళ్లిపోయారు.

Leave a Reply

*