త‌మిళ‌నాడులో ప‌న్నీర్ సెల్వం కొత్త చ‌రిత్ర సృష్టిస్తున్నాడు…..!

త‌మిళ‌నాడు సీఎం ప‌న్నీర్ సెల్వం కొత్త చ‌రిత్ర సృష్టించ‌డానికి రెడీ అవుతున్నాడు. ఆ రాష్ట్ర చ‌రిత్ర‌లో తొలిసారిగా నూత‌న అధ్యాయానికి తెర‌తీస్తున్నాడు. ఏ తమిళ‌నాడు ముఖ్య‌మంత్రికీ రాని అవ‌కాశం ఆయ‌న‌కు వ‌చ్చింది.ఇంత‌కీ అస‌లు విష‌యం ఏంటంటే.. ఈ నెల 26న జ‌ర‌గ‌నున్న గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌ల‌కు రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ బ‌దులుగా ముఖ్య‌మంత్రి ప‌న్నీర్ సెల్వం జాతీయ ప‌తాకాన్ని ఎగుర‌వేయ‌నున్నారు.

త‌మిళ‌నాడు రాష్ట్ర చ‌రిత్ర‌లోనే ఇలా రిప‌బ్లిక్ డే దినోత్స‌వం రోజు గ‌వ‌ర్న‌ర్‌కి బ‌దులు ముఖ్య‌మంత్రే జాతీయ ప‌తాకాన్ని ఎగుర‌వేయ‌డం ఇది తొలిసారి అంట‌. త‌మిళ‌నాడుకి ప్ర‌స్తుతం గ‌వ‌ర్న‌ర్ లేరు. ఇన్‌చార్జ్ గ‌వ‌ర్న‌ర్‌గా మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ సీహెచ్ విద్యాసాగ‌ర్ రావు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆయ‌న ముంబ‌యిలోనే జాతీయ ప‌తాకాన్ని అవ‌న‌తం చేయ‌నున్నారు.
దీంతో, ఆ అవ‌కాశం ఆయ‌న‌కు వ‌చ్చింది.

ప్రతియేటా స్వాతంత్య్ర దినోత్సవం రోజున సెయింట్‌ జార్జికోటపై ముఖ్యమంత్రి, మెరీనాబీచ్ గాంధీ విగ్రహం ప్రాంతం వద్ద జరిగే గణత్రంత వేడుకల్లో రాష్ట్ర గవర్నర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం ఆనవాయితీగా జరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రానికంటూ పర్మినెంట్‌ గవర్నరు లేకపోవడం ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం మెరీనాబీచ్ వద్ద జరిగే గణతంత్ర వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగురవేయనున్నారు.

Leave a Reply

*