శ‌భాష్ మోదీ.. నోట్ల ర‌ద్దు తొలి ఫ‌లితాలు మొద‌ల‌య్యాయి….!

పెద్ద నోట్ల ర‌ద్దుపై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు చెక్ ప‌డే రోజులు ద‌గ్గ‌ర‌కి వ‌స్తున్నాయి. మోదీ ఓ పెద్ద ప్ర‌హస‌నాన్ని సృష్టించారు మిన‌హా మ‌రేమీ లేద‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ, అవ‌న్నీ పాత క‌బుర్ల‌ని.. నోట్ల ర‌ద్దుతో మోదీ సాధించింది ఏంటో మ‌మ్మ‌ల్ని అడ‌గాలంటూ చెబుతున్నారు కాశ్మీరీయులు.

పెద్ద నోట్ల త‌ర్వాత జ‌మ్మూ క‌శ్మీర్‌లో ఒక్క ఉగ్ర‌వాద సంఘ‌ట‌న కూడా చోటుచేసుకోలేదు. వారి కార్య‌క‌లాపాలు దాదాపు 60 శాతం త‌గ్గాయి. డిసెంబ‌ర్ నెల‌లో కాశ్మీరీ లోయ‌లో ఒకే ఒక్క పేలుడు సంభ‌వించింది. దీనిని బ‌ట్టి అర్ధం చేసుకోవ‌చ్చు నోట్ల ర‌ద్దు త‌ర్వాత ఫేక్ క‌రెన్సీ లేక ఉగ్ర‌వాదులు ఏ విధంగా అల్లాడి పోతున్నారు. వారికి ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రయిన నకిలీ నోట్ల‌కు ఉచ్చు బిగిసుకోవ‌డ‌మే దీనికి ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని చెప్పాల్సిన ప‌నిలేదు.

ఇక‌, నోట్ల ర‌ద్దుతో మోదీ కొట్టిన మ‌రో దెబ్బ‌.. హ‌వాలా రంగంపై. నోట్ల ర‌ద్దు త‌ర్వాత హ‌వాలా ఏజెంట్‌ల ఫోన్‌కాల్స్ ట్రాఫిక్ స‌గానికి స‌గం పడిపోయిందని టెలికాం కంపెనీలు చెబుతున్నాయి. కొత్త నోట్ల‌లోని కొంగొత్త సెక్యూరిటీ ఫీచ‌ర్‌లు, ఉపయోగించిన రంగులు ఫేక్ క‌రెన్సీ రాయుళ్ల‌కు చెక్ చెప్పాయ‌ట‌. దీంతో, కొత్త నోట్లను కాపీ కొట్టడం చాలా క‌ష్టంగా మారింద‌ట‌.

ఇక‌, 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసిన తర్వాత జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో రాళ్లు రువ్వే ఘటనలు బాగా తగ్గిపోయాయి. ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టే కొన్ని బృందాలు ఈ పెద్దనోట్లను స్థానిక కమాండర్లకు ఇచ్చి, వాళ్ల ద్వారా స్థానిక యువకులకు డబ్బులిచ్చి వారిని రెచ్చగొట్టి రాళ్లు రువ్వించేవి. ఇప్పుడు పెద్దనోట్లను రద్దు చేయడం, కరెన్సీ పెద్దమొత్తంలో అందుబాటులోకి రాకపోవడంతో ఇలా డబ్బులిచ్చి రెచ్చగొట్టడం కూడా తగ్గింది.

 

Leave a Reply

*