బ్రేకింగ్‌… కేంద్రం కొత్త స్కీమ్‌… నెల‌నెలా అకౌంట్‌ల‌లో డ‌బ్బు…మార్చి నుంచే….!

పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత మోదీ ప్ర‌భుత్వం ప‌థ‌కాలు, ఆలోచ‌న‌లు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. నోట్ల ర‌ద్దు ఎపిసోడ్‌లో ఆయ‌న స‌ర్కార్ బొక్క‌బోర్లా ప‌డ్డా… ప‌రువు కాపాడుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అందుకే, కొత్త స్కీములు ప్ర‌వేశ పెట్ట‌డానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నార‌ట‌. నిన్న‌మొన్న‌టిదాకా ఆయ‌న పేద ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే కొత్త త‌ర‌హా ప‌థ‌కం ప్ర‌వేశ పెడ‌తార‌ని, దీంతో, వారి ఆర్ధిక అభ్యున్న‌తికి ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని అంచ‌నా వేస్తున్నార‌ట‌. ప్ర‌తి నెలా అకౌంట్‌ల‌లో వెయ్యి లేదా రెండు వేల రూపాయ‌ల‌ను డిపాజిట్ చేస్తే అది వారి జీవనానికి భ‌రోసా క‌ల్పించ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఆర్ధిక వేత్త‌లు చెబుతున్నారు.

యూనివ‌ర్శ‌ల్ బేసిక్ ఇన్‌క‌మ్ అంటే.. సార్వ‌త్రిక క‌నీస ఆదాయ ప‌థ‌కం.. ఇదే మోదీ ప్రభుత్వం ప్ర‌వేశ పెట్టబోతున్న ప‌థ‌క‌మ‌ట‌. కులం, మ‌తం, వ‌ర్గం, వ‌ర్ణం, ధ‌నిక‌, పేద బేధాలేవీ లేకుండా.. ఆదాయం త‌క్కువ‌గా ఉన్న వారంద‌రికీ ఈ ప‌థ‌కాన్ని వర్తింప చేయాల‌ని మోదీ భావిస్తున్నార‌ట‌. జ‌న‌వ‌రి 31న ప్ర‌వేశ పెట్ట‌నున్న ఆర్ధిక స‌ర్వేలో ఈ ప‌థ‌కంపై ప్ర‌స్తావ‌న ఉంటుంద‌ని.. బిజినెస్ ఇన్‌సైడ‌ర్ అనే ప‌త్రిక ఇటీవ‌లే ఓ క‌థ‌నం ప్ర‌చురించింది. ఈ ఆర్ధిక సంవ‌త్స‌రం నుంచే ఈ ప‌థ‌కం అమ‌లులోకి రానుంద‌ని అభిప్రాయ ప‌డింది.

ఈ ప‌థకం ఇప్ప‌టికే ప‌లు దేశాల‌లో ఉంద‌ని, దానిని భార‌త్‌లో మొద‌టిసారిగా ప్ర‌వేశ పెట్ట‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం స‌న్న‌ద్ధ‌మవుతోంద‌ట‌. దీనిపై అప్పుడే విమ‌ర్శ‌లు కూడా మొద‌ల‌య్యాయి. పేద‌ల‌ను బ‌ద్ద‌క‌స్తులుగా, ప‌ని చెయ్య‌నివారిగా చెయ్య‌డానికి.. ఓట్ల కోస‌మే ఈ జిమ్మిక్కు అని ప‌లువురు విమ‌ర్శిస్తున్నారు. అయితే, దీనితో ఆయా దేశాల‌లో పేద‌రికం శాతం త‌గ్గింద‌ని, నిమ్నాదాయ కుటుంబాల‌లో జీవ‌నంపై భ‌రోసా క‌లిగింద‌ని చెబుతున్నారు. ఏ వాద‌ప్ర‌తివాద‌న‌ల సంగ‌తి ఎలా ఉన్నా.. త్వ‌ర‌లోనే మోదీ స‌ర్కార్ భారీ ప‌థ‌కం అమ‌లులోకి రానుంద‌న్న‌మాట‌.

Leave a Reply

*