ఈ ద‌ర్శ‌కుడు ఆ టైపా…?

క‌ర‌ణ్ జోహార్‌…. బాలీవుడ్ ద‌ర్శ‌కుడే కానీ.. ఈయ‌న సౌత్ ప్రేక్ష‌కుల‌కు కూడా బాగా సుప‌రిచతం. కుచ్ కుచ్ హోతా హై, క‌భీ ఖుషీ క‌భీ ఘ‌మ్‌, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌, క‌ల్ హో న హో వంటి సినిమాల‌తో బాలీవుడ్ చిత్ర ప‌రిశ్ర‌మ‌ని షేక్ చేసిన ఈ ద‌ర్శ‌కుడు సెక్స్ జీవితంపై ప‌లు ఆస‌క్తిక‌ర క‌థ‌నాలు వినిపిస్తుంటాయి.40ల‌లోకి ఎంట్రీ ఇచ్చినా ఈ ద‌ర్శ‌కుడు ఇంత‌వ‌ర‌కు పెళ్లి చేసుకోలేదు. దీనికితోడు ఆయ‌న ఎక్కువ‌గా మ‌గ‌వారితోనే గ‌డుపుతుంటాడ‌ని, ఆయ‌న గే అనే క‌థ‌నాలు బాలీవుడ్‌లో కుప్ప‌లు తెప్ప‌లుగా వ‌చ్చి ప‌డుతుంటాయి.

ఇటీవ‌ల క‌ర‌ణ్ జోహార్‌ని ఓ ప‌త్రిక ఇంట‌ర్‌వ్యూ చేసింది. దీంట్లో ఆయన చెప్పిన విష‌యాలు ఆస‌క్తిక‌రంగా ఉన్నాయి. త‌న సెక్స్‌పై ఎవ‌రూ ఎలాంటి సందేహాలు పెట్టుకోవ‌ద్ద‌ని చెబుతూనే.. తాను ఆ విష‌యాలు బ‌య‌ట‌కు చెబితే కొందరు త‌న‌పై కేసులు వేస్తార‌ని చెప్పుకొచ్చారు. కేసులు వేస్తారంటే ఆయ‌న స‌హ‌జప్ర‌కృతి నియ‌మాల‌కు విరుద్ద‌మైన ప‌నులు చేస్తున్నాడ‌నే క‌దా అర్ధం…? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు.అంతేకాదు, షారుక్‌తో ఆయ‌న కొన్ని బ‌హిరంగ వేదిక‌ల‌పై లిప్ టు లిప్ కిస్ కూడా ఇచ్చాడు.

దీంతో, ఇద్ద‌రి మ‌ధ్య అలాంటి రిలేష‌న్ కూడా ఉంద‌నే ప్ర‌చారం జ‌రిగింది. దీనిపైనా ఆయ‌న స్పందించారు.. షారుక్ ఖాన్ త‌న‌కు సోద‌రుడు లాంటి వాడు అని చెప్పాడు. మీరు సోద‌రుడితో క‌లిసి పండుకుంటారా..? అని ప్ర‌శ్నించారు. దీంతో, ఆయ‌న చెప్పిన స‌మాధానంపై ప‌లు అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. షారుక్‌తో రిలేష‌న్ ఏంటి అన్న ప్ర‌శ్న‌కు…. అది తప్పు అని కానీ, ఛీ ఛీ మా మ‌ధ్య ఆ రిలేష‌న్ లేద‌ని చెప్పాలి కానీ, ఈ ఆన్స‌ర్ ఏంటి..? అని ప‌లువురు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. మొత్త‌మ్మీద‌, క‌రణ్ జోహార్ ఇంట‌ర్‌వ్యూ చూస్తే ఆయ‌న అదో టైప్ అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Leave a Reply

*