పార్టీ మార్పుపై చిరంజీవి ఏర్పాట్లు…. సిగ్న‌ల్స్ కూడా పంపార‌ట‌…?

చిరంజీవి తెలుగుతెర‌పై తిరుగులేని హీరో… కానీ, రాజ‌కీయాల‌లో మాత్రం ఆయ‌నది ఫెయిల్యూర్ స్టోరీ. అందుకే, 9 ఏళ్ల త‌ర్వాత మెగాస్టార్ మ‌ళ్లీ సిల్వ‌ర్ స్క్రీన్ సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసుకుంటున్నారు. అయితే, ఆయ‌న పార్టీ కాంగ్రెస్ అటు కేంద్రంలో కానీ, ఇటు రాష్ట్రంలో కానీ అధికారంలో లేదు. ఇప్పుడ‌ప్పుడే వ‌స్తుంద‌న్న ఆశ‌లు, ఆలోచ‌న‌లు కూడా పార్టీకి లేవు. దీంతో, చిరంజీవి త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తు తాను చూసుకుంటున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

ప్రెజెంట్ చిరంజీవి సినిమాల‌తో బిజీగా ఉన్నారు. రీ ఎంట్రీలో తొలి సినిమా ఖైదీ నెంబ‌ర్ 150 విడుద‌ల‌కు రెడీగా ఉంది. త్వ‌ర‌లోనే మ‌రికొన్ని సినిమాల‌కు కూడా సైన్ చేయ‌బోతున్నాడు. మ‌రి, చిరంజీవి పాలిటిక్స్‌కి ఫుల్ స్టాప్ పెట్టిన‌ట్టేనా…? అంటే కాదంటున్నారు విశ్లేష‌కులు. దేశ రాజ‌కీయాల‌లో ఉనికి కోసం పోరాడుతున్న కాంగ్రెస్‌ని వ‌దల‌డ‌మే బెట‌ర‌ని భావిస్తున్నార‌ట‌. దీనికి కొంత‌మంది కార‌ణాల‌ను కూడా చూపిస్తున్నారు.

ఆ మ‌ధ్య ఆయ‌న బీజేపీలో చేర‌తార‌నే ప్ర‌చారం జ‌రిగింది. అది అబ‌ద్ధ‌మ‌ని ఖండించారు చిరంజీవి. కానీ, తాజాగా గుంటూరులోని హాయ్ లాండ్‌లో జ‌రిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి అటు బీజేపీ ఇటు టీడీపీ నేత‌లు హాజ‌ర‌య్యారు. మంత్రి కామినేని, మంత్రి ప‌త్రిపాటి పుల్లారావులు విచ్చేసి స‌భ‌లో కాసేపు క‌నిపించి వెళ్లిపోయారు. దీంతో ఒక్క‌సారిగా గాసిప్స్ గుప్పుమంటున్నాయి. చిరంజీవి భ‌విష్య‌త్ రాజ‌కీయానికి హాయ్‌లాండ్‌లో పునాది ప‌డిందని జోరుగా ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. ఆయ‌న బీజేపీలో చేర‌తార‌ని కొంద‌రు, కాదు సైకిల్ ఎక్క‌నున్నార‌ని మ‌రికొంద‌రు బలంగా వాద‌న‌లు వినిపిస్తున్నారు. మ‌రి, ఖైదీ విడుద‌ల త‌ర్వాత చిరంజీవి త‌న పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్‌పై ఓ నిర్ణ‌యం తీసుకుంటారా..? అనేది హాట్ టాపిక్‌గా మారింది.

 

Leave a Reply

*