నయీంతో రెడ్డి నేతలకు రెడ్ మార్క్

naeem-connections-with-reddy-leaders

నయీం కేసు కదిపితే చాలు..రెడ్డి సామాజికవర్గ నేతలు హడలిపోతున్నారు. ఏ పార్టీ నుంచి ఎవరు ఆరోపించిన..రెడ్డి సామాజికవర్గ నేతలు తప్పనిసరిగా వుండటం యిప్పుడు కలవరం కలిగిస్తోంది. కరడుగట్టిన క్రిమినల్, గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్ కు కారకుల నుంచి..నయీంను పెంచి పోషించిన వారంతా..రెడ్డి సామాజికవర్గ ప్రముఖులేనని వస్తున్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. చంద్రబాబు హయాంలో వేసిన గంజాయి మొక్కలాంటి నయీంను అప్పటి హోం మంత్రి మాధవరెడ్డి అండదండలు కల్పించారని ఆరోపణలున్నాయి.

ఆ తరువాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గా వున్నప్పడు నక్సల్స్ ను మట్టుబెట్టేందుకు నయీంను వినియోగించుకున్నారని వార్తలొచ్చాయి. మాజీ డీజీపీ దినేష్ రెడ్డి నయీంతో సంబంధాలున్నాయనే ఆరోపణలొస్తే..ఆయన ఖండించారు. కర్నూలు జిల్లాకు చెందిన రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ శివానందరెడ్డి కూడా నయీంతో చెట్టాపట్టాలేసుకు తిరిగాడనే ప్రచారం సాగింది. ఈ వార్తలను ఆయన కూడి ఖండించాడనుకోండి.

నల్గొండ జిల్లాలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఓ మంత్రి కూడా నయీంతో సంబంధాలున్నాయని, మాజీ ఉమా మాధవరెడ్డి నయీం దందాలకు అండగా వున్నారనే ఆరోపణలొస్తే..ఆమె ఖండించారు. కోమటిరెడ్డి సోదరులు, మంచిరెడ్డి కిషన్ రెడ్డితోపాటు చాలా మంది రెడ్డి నేతలకు నయీం కేసులో రెడ్ మార్క్ వేశారని, అయితే వీరందరికీ నయీంతో సంబంధాలున్నాయిని ఎవరూ ధ్రువీకరించకపోయినప్పటికీ రెడ్డి నేతల మధ్యే వార్, ఆధిపత్య పోరు నయీంతో లింకులు అంటగట్టే ఆరోపణలకు ప్రధానకారణమని తెలుస్తోంది.

Leave a Reply

*