శాతకర్ణికి పైరసీ భూతం..లీకైన యుద్ధం సన్నివేశాలు..!!

నందమూరి బాలకృష్ణ నటించిన వందో చిత్రం ‘గౌతమి పుత్రా శాతకర్ణి’ భారీ అంచానాల మధ్య ఎట్టకేలకు ప్రపంచ వ్యాప్తంగా జనవరి 12న రిలీజైంది. చారిత్రాత్మక చిత్రం కావడంతో ఈ సినిమా మొదటి రోజే పాజిటీవ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక అలా రిలీజై థియేటర్స్ లోకి వచ్చిందో లేదో..అప్పుడే కొన్ని సీన్స్ లీకయ్యి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి! అలా బయటకి వచ్చిన సీన్స్ యుద్ధానికి సంబంధించినవి కావడం విశేషం. గుర్రం మీద నుంచి స్వారీ చేస్తూ..ముందు ఒక పిల్లాడిని కూర్చోబెట్టుకొని బాలయ్య చేస్తున్న యుద్ధ సన్నివేశాలు చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకునేలా ఉన్నాయి.

దీంతో ఫుల్ టెన్షన్ పడుతున్నారు శాతకర్ణి చిత్ర యూనిట్. భారీ బడ్జెట్ చిత్రం ఇలా పైరసీకి గురవడ్డం వల్ల ఏమైనా చర్యలు తీసుకుంటారేమో చూడాలి. ఇదిలా ఉంటే..నిన్న రిలీజైన చిరంజీవి ఖైదీలోకి కొన్ని సీన్స్ తో పాటు, సాంగ్స్ కూడా లీకై బయటకొచ్చిన విషయం తెలిసిందే. స్టార్ హీరోల సినిమాలు ఇలా రిలీజు రోజే బయటకి రావడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దర్శకనిర్మాతలు.మరి ఇక మీదటైనా ఇలా లీకుల భారీ నుంచి బయటపడేలా జాగ్రతలు తీసుకుంటారేమో చూడాలి.

Leave a Reply

*