మెగా కాంపౌండ్‌ని మ‌ళ్లీ కెలికిన వ‌ర్మ‌..ఈసారి నాగబాబు ఏమంటాడో….!

త‌గ్గితే ఆయ‌న రామ్‌గోపాల్ వ‌ర్మ ఎందుక‌వుతారు..? అందుకే, మ‌రోసారి మెగా కాంపౌండ్‌పై ట్విట్ట‌ర్ వేదిక‌గా కౌంట‌ర్‌లు వేశారు. మొన్న‌టి నాగ‌బాంబ్‌, నిన్న‌టి మెగాస్టార్ చిరంజీవి వార్నింగ్‌తో వ‌ర్మ మెగా ట్వీట్‌ల‌కు కాస్తయినా దూరం అవుతాడ‌ని, వారిని ప‌ట్టించుకోడ‌ని భావించారంతా. కానీ, త‌న పంథా ఇదేన‌ని మ‌రోసారి తేల్చిచెప్పాడు.

నిన్న చిరంజీవి ఖైదీ నెంబ‌ర్ 150 త‌ర్వాత చిరంజీవి ఒక్క కామెంట్ కూడా చెయ్య‌లేదు. చిరు సెకండ్ ఇన్నింగ్స్ తొలి మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్ వ‌చ్చినా ఆయ‌న లైట్ తీసుకున్నాడు. కానీ, ఇవాళ గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి విడుద‌ల‌యిందో లేదో.. ఆయ‌న ట్విట్ట‌ర్‌లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. జ‌న‌వ‌రి 8త‌ర్వాత వ‌ర్మ సోష‌ల్ మీడియాలో క‌నిపించ‌డం ఇవాళే. శాత‌క‌ర్ణిపై ఆయ‌న ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించాడు. బాల‌కృష్ణ‌, క్రిష్‌కి సెల్యూట్ అంటూ మొద‌లు పెట్టిన వ‌ర్మ‌… అరువు తెచ్చుకున్న క‌థ‌తో తెలుగు సినిమాని ప‌దేళ్లు వెన‌క్కి తీసుకుపోతే.. శాత‌క‌ర్ణి తెలుగు సినిమా స్థాయిని వంద‌ల రెట్లు పెంచిందంటూ ఆకాశానికి ఎత్తేశాడు. ఇప్ప‌టికయినా మెగా వ్య‌క్తులు ఈ య‌దార్ధాన్ని గుర్తించ‌క‌పోతో మినీగా మారిపోతార‌ని సెటైర్ కూడా వేశాడు.

నాగబాంబ్‌కు వ్య‌తిరేకంగానే ఈ ట్వీట్ వ‌ర్మ వేశాడ‌ని మెగాభిమానులు మండిప‌డుతున్నారు. ఇంత‌వ‌ర‌కు ఓకే… మ‌రి, మెగాబ్ర‌ద‌ర్ దీనిపై మ‌ళ్లీ కామెంట్ చేస్తాడా…? లేదా.. సైలెంట్‌గానే ఉండిపోతాడా..? అనేది హాట్ టాపిక్‌గా మారింది.

 

Leave a Reply

*