నాగ‌బాబు బాబాయ్ నువ్వు దేవుడివి అంటున్న‌ రాం చ‌ర‌ణ్‌..!

చిరు త‌న‌యుడు చిరుత రాంచ‌ర‌ణ్‌..నిర్మాత‌గా వ‌చ్చిన ఖైదీ సూప‌ర్ స‌క్సెస్ క్రెడిట్ అంతా బాబాయ్ నాగ‌బాబుదే అని ఆనంద‌ప‌డుతున్నారు చెర్రీ. అవ‌కాశం ఇస్తే గుడి క‌ట్టేస్తాడ‌నేంత రేంజ్‌లో ఫుల్ ఖుషీగా వున్నాడు రాంచ‌ర‌ణ్‌. మేన‌మామ అల్లు అర‌వింద్ నిర్మాణ బాధ్య‌త‌లు ప‌ర్య‌వేక్షిస్తే..అక్క సుస్మిత స్టైలింగ్ డిపార్ట్‌మెంట్ చూసుకుంటే.. తండ్రి మెగాస్టార్ చిరంజీవి..త‌న 150 సినిమాకు అన్నీ తానై వ్య‌వ‌హ‌రించి హిట్ కొట్ట‌డంతో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. అయితే ఖైదీ నెంబ‌ర్ 150 సూప‌ర్‌హిట్ ను ముందే ఫిక్స్ చేసింది మాత్రం నాగ‌బాబు.

సినిమా నిర్మాణంలో గానీ, క‌థ ఎంపిక‌లో గానీ పాలుపంచుకోని నాగ‌బాబు.. ఖైదీ నెంబ‌ర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌కు వ‌చ్చి ..యండ‌మూరి, రాంగోపాల్‌వ‌ర్మ‌ల‌ను క‌డిగి పారేశాడు. దీనికి కౌంట‌ర్ అటాక్ వ‌ర్మ స్టార్ట్ చేశాడు. యండ‌మూరి కూడా నాగ‌బాబును లైట్ తీసుకుని ..అంత‌గా స్పందించాల్సిన అవ‌సరం వుందా అని మాత్ర‌మే స్పందించాడు. దీంతో ఒక్క‌సారిగా సోష‌ల్ మీడియా అంతా ఖైదీ మూవీ వార్త‌ల‌తో నిండిపోయింది. నాగ‌బాబు స్పీచ్‌, ఆర్జీవీ ట్వీట్లు టాప్ ట్రెండింగ్‌లో నిలిచాయి. ఇది చిరు 150 సినిమాకు కొన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టినా తీసుకురాలేని ప‌బ్లిసిటీ తీసుకొచ్చింది. అందుకే నాగ‌బాబును ..ఖైదీ నిర్మాత రాంచ‌ర‌ణ్ పొగిడేస్తున్నాడ‌ట‌.

మ‌న‌సులో బాబాయ్‌కు గుడి క‌ట్టేసేంత రేంజ్‌లో ప్రేమ పెంచుకున్నాడ‌ట‌. మెగా స్టార్ త‌మ్ముడిగా సినీరంగం ప్ర‌వేశం చేసిన నాగ‌బాబు..ఆ త‌రువాత‌ అంజ‌నా ప్రొడ‌క్ష‌న్స్ బేన‌ర్‌లో నిర్మాత‌గా అన్న చిరును హీరోగా పెట్టి సినిమాలు తీశాడు. అన్న కొడుకు రాంచ‌ర‌ణ్ కు లైఫ్ ఇద్దామ‌ని తానే నిర్మాత‌గా ఆరెంజ్ తీశాడు నాగ‌బాబు. ఆరెంజ్ ఒక రేంజ్‌లో దెబ్బ కొట్ట‌డం..అన్న చిరంజీవి కానీ, ఆయ‌న త‌న‌యుడు చ‌ర‌ణ్ కానీ క‌నీసం మాట సాయం కూడా చేయ‌క‌పోవ‌డంతో నాగ‌బాబు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశాడ‌ని అప్ప‌ట్లో రూమ‌ర్లు వ‌చ్చాయి. అప్పుడే ప‌వ‌న్‌క‌ల్యాణ్ నాగ‌బాబును ఆదుకున్నార‌ని మ‌రో టాక్‌.

అయితే త‌మ సినీ జీవితాల‌కు పునాది రాళ్లు వేసిన అన్న‌య్య అంటే నాగ‌బాబుకు ఎన‌లేని అభిమానం. చెర్రీ ఆరెంజ్‌తో దెబ్బ అయినా వ‌రుణ్‌తేజ్‌, నీహారిక‌ల స‌క్సెస్‌తో మ‌ళ్లీ నిల‌దొక్కుకున్నాడు. చిరు చేసిన మేలు మాత్ర‌మే గుర్తుంచుకుని చెర్రీ ఆరెంజ్తో కొట్టిన దెబ్బ‌ను మ‌రిచిపోయి.. త‌న అన్న చిరు, ఆయ‌న కుటుంబంపై అంతులేని అభిమానం ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ వేదిక‌పై నుంచి ప్ర‌క‌టించి.. ట్వీట్ స్టార్ ఆర్జీవీని, ప‌ర్స‌నాలిటీ డెవ‌ల‌ప్‌మెంట్ స్పీక‌ర్ యండ‌మూరిని కెలికి సినిమాకు విప‌రీత‌మైన హైప్ తీసుకొచ్చాడు. ఖైదీ నెంబ‌ర్ 150 సినిమా సూప‌ర్‌డూప‌ర్ హిట్ కావ‌డంలో నాగ‌బాబు కూడా త‌న పాత్ర పోషించాడ‌న్న మాట..

 

Leave a Reply

*