షాకింగ్..నాగబాబుకి థ్యాంక్స్ చెప్పిన బాలయ్య ఫ్యాన్స్..!

మెగా వర్సెస్ నందమూరి అభిమానుల మధ్య ఎప్పటినుంచో కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. కానీ తాజాగా ఊహించని రీతిలో మెగా బ్రదర్ నాగబాబుకు నందమూరి బాలకృష్ణ అభిమానులు థ్యాంక్స్ చెపుతున్నారు! వినడానికి విచిత్రంగా ఉన్నా..ఇది నిజమట. గుంటూరులో జరిగిన ఖైదీ నంబర్ 150వ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ వేదికపై నుంచి నాగబాబు మాట్లాడుతూ.. ఒక హిట్ సినిమాను ఆపలేరు. ఫ్లాప్ సినిమాను లేపలేరు అంటూ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తన అన్నయ్య చిరంజీవి చిత్రం ఖైదీ నంబర్ 150వ చిత్రం గురించి చేసిన కామెంట్స్‌కు కౌంటర్ ఇచ్చారు.

ఇక్కడ విశేషం ఏంటంటే..నాగబాబు కామెంట్స్‌నే బాలయ్య ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు. నాగబాబు సార్ ఈజ్ 100 శాతం కరెక్ట్. ఒక హిట్ సినిమాను ఆపలేరు. ఫ్లాప్ సినిమాను లేపలేరు. జై బాలయ్య.. అన్న ఈ పోస్టును పెట్టి తెగ హడావిడి చేస్తున్నారు. ఇంతకీ వాళ్ళు ఈ కామెంట్స్ ఎందుకు చేశారో ఈపాటికే మీకు అర్ధమైఉంటుందిగా.

ఒకతట్టు శాతకర్ణి హిట్ టాక్ పై అటు మెగా స్టార్ చిరంజీవి సైతం బాలయ్యను అభినందిస్తుంటే..ఇక్కడ ఫ్యాన్స్ మాత్రం ఇంత రచ్చ లేపడం అందరినీ ఆలోచింపచేస్తుంది. చూడాలి మరి బాక్సాఫీస్ రిపోర్ట్స్ వచ్చేటప్పటికి ఇంకెన్ని గొడవలు జరుగుతాయో.

Leave a Reply

*