ఇలా చేశారేంటి.. చిరు ఖైదీని చూసి ఫీల‌యిన మురుగ‌దాస్‌….!

ఖైదీ నెంబ‌ర్ 150.. ఇది త‌మిళ్ క‌త్తికి రీమేక్. దీనికి క‌థ‌, క‌థ‌నం ద‌ర్శ‌క‌త్వం వ‌హించింది త‌మిళ్ డైరెక్ట‌ర్ మురుగ‌దాస్. త‌మిళ్‌లో విజ‌య్ హీరోగా తెర‌కెక్కిన ఈ చిత్రం సంచ‌ల‌నం విజ‌యం సాధించ‌డంతో దానిని తెలుగులో రీమేక్ చేశాడు చిరంజీవి. క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తోపాటు మెస్సేజ్ కూడా క‌లిసి ఉండ‌డం సినిమాకి బాగా క‌లిసి వ‌చ్చింది. చిరు ఖైదీ 150ని మురుగ‌దాస్ ఇవాళ హైద‌రాబాద్‌లో చూసేశారు. ఈ మూవీ చూసిన ఆయ‌న కాస్త ఇబ్బంది ఫీల‌య్యార‌ట‌.

ఖైదీ నెంబ‌ర్ 150 చిత్రంలో ఓ కామెడీ ట్రాక్ ఉంటుంది. అది ఆయ‌నను ఫీల‌య్యేలా చేసింద‌ట‌. ఇంత‌కీ మేటర్ ఏంటంటే.. మురుగదాస్‌కి లిక్క‌ర్ అంగే గిట్ట‌దు. దాదాపు ఆయ‌న డైర‌క్ట్ చేసే సినిమాల‌లో అలాంటి సీన్స్‌లో లేకుండా చూసుకుంటాడ‌ట మురుగ‌దాస్‌. త‌మిళ్ క‌త్తి మూవీలోనూ విల‌న్ గ్రీన్ టీ తాగుతున్న‌ట్లు చూపించాడు మురుగదాస్‌. కానీ, ఖైదీ నెంబ‌ర్ 150 చిత్రంలో ఏకంగా ఓ కామెడీ ట్రాక్ మొత్తం లిక్క‌ర్ సెంట‌ర్‌గానే న‌డ‌వ‌డం ఆయ‌న‌ను ఇబ్బంది పెట్టింద‌ట‌. ఈ సీన్ హీరోకి, క‌మెడియ‌న్‌కి మ‌ధ్య సాగుతుంది. దీనిని చూసిన మురుగ‌దాస్‌.. ఇదేంటి.. ఇలా చేశారు..? అని త‌న చుట్టుప‌క్క‌న ఉన్న వారితో త‌న అభిప్రాయం షేర్ చేసుకున్న‌ట్టు స‌మాచారం.

ఇటు, ఆలీకి లేడీ గెట‌ప్ వేసిన సీన్‌పైనా ఆయ‌న త‌న అసంతృప్తిని వ్య‌క్తం చేశాడ‌ట‌. మ‌రో యాంగిల్‌లో ఆలోచిస్తే బావుండేది క‌దా….? అని అన్న‌ట్లు తెలుస్తోంది. కానీ, ప‌క్కా క్లాసీగా సినిమాలు చేసే మురుగ‌దాస్‌కి మ‌న జ‌నాల మాస్ టేస్ట్ అలాగే ఉంటుంది మ‌రి అని కామెంట్స్ వేస్తున్నార‌ట చాలా మంది.

 

Leave a Reply

*