ఖైదీ నెంబ‌ర్ 150 తొలి రివ్యూ వ‌చ్చేసింది… రేటింగ్ కూడా..!

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌. చిరంజీవి 150వ సినిమా తొలి రివ్యూ వ‌చ్చేసింది. ప్ర‌ఖ్యాత బాలీవుడ్ క్రిటిక్, రివ్యూయ‌ర్ ఉమ‌ర్ సంధూ రివ్యూ ఇచ్చేశాడు. ఆయ‌న యూఏఈ ఫిలిం బోర్డ్‌లో సెన్సార్ బోర్డ్ స‌భ్యుడు. ఆయ‌న రాసిన రివ్యూ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

రైతు స‌మ‌స్య‌ల బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్కిన ఈ చిత్రం ఓ మంచి స‌మ‌స్య‌ను ఆవిష్క‌రించింది. ఠాగూర్ త‌ర్వాత చిరంజీవి-వివి వినాయ‌క్ కాంబోలో వ‌చ్చిన ఈ చిత్రం సందేశాత్మ‌క మూవీగా తెరకెక్కింది. మెస్సేజ్ ఓరియెంటెడ్‌మూవీయే అయినప్ప‌టికీ ప‌క్కా వాణిజ్య విలువ‌లు ఉన్న మూవీ అని పేర్కొన్నారు ఉమ‌ర్ సంధూ. ఫ‌స్ట్ హాఫ్, సెకండ్ హాఫ్‌లు రెండూ టెర్రిఫిక్‌గా ఉన్నాయ‌న్నారు.. దేవి శ్రీ ప్ర‌సాద్ స‌మ‌కూర్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింద‌ట‌. ఇక ర‌త్న‌వేలు సినిమాటోగ్ర‌ఫీ క‌న్నుల పండువగా సాగింద‌ని తెలిపాడు. క‌థ‌, క‌థ‌నం ప్రేక్ష‌కుల‌కు ఆక‌ట్టుకునేలా సాగింద‌ని రాశాడు.. సింగిల్‌స్క్రీన్ థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల విజిల్స్‌కి, చ‌ప్ప‌ట్ల‌కి బాక్స్‌లు బ‌ద్ద‌లవ‌డం ఖాయ‌మ‌ని వివ‌రించాడు. సంభాష‌ణ‌లు చ‌ప్ప‌ట్లు కొట్టేలా సాగాయ‌ని వివ‌రించాడు. క్లైమాక్స్ ఫైట్‌.. మైండ్ బ్లోయింగ్ అని, టాలీవుడ్‌లో ఇదో కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తుంద‌ని వివ‌రించాడు.
ఇక ప్రొడ‌క్ష‌న్ వేల్యూస్‌…. నిర్మాణ విలువ‌లు అదిరిపోయాయ‌ని తెలిప‌డు.

న‌టీన‌టుల పెర్‌ఫార్మెన్స్‌.. కెరీర్‌లో ది బెస్ట్ అన‌ద‌గ్గ పెర్‌ఫార్మెన్స్‌ని చిరంజీవి డెలివ‌ర్ చేశాడ‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు ఉమ‌ర్ సంధూ. చిరంజీవి త‌న 150వ సినిమాలో వీర లెవ‌ల్‌లో రెచ్చిపోయాడ‌ని వివ‌రించాడు. టోట‌ల్‌గా ఇది వ‌న్ మేన్ షో అట‌. కాజ‌ల్ అగ‌ర్వాల్ గ్లామ‌ర‌స్ పాత్ర‌లో ఆక‌ట్టుకుంద‌ట‌. చిరంజీవికి త‌గిన జోడీలా ఆమె బాగా సెట్ అయింద‌ని వివ‌రించాడు. ఇద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ కూడా బాగా వ‌ర్క్ అవుట్ అయింద‌ని తెలిపాడు. విల‌న్‌గా న‌టించిన త‌రుణ్ అరోరా న‌ట‌న కూడా బావుంద‌ని తెలిపాడు. చిన్న రోలే అయినా రామ్‌ చ‌ర‌ణ్ హాట్‌గా క‌నిపించాడ‌ని వివ‌రించాడు.

ఫైన‌ల్‌గా… చిరంజీవి శ‌క్తిసామ‌ర్ధ్యాలు తెలుసుకొని వివి వినాయ‌క్ వాటిని బాగా క్యాష్ చేసుకున్నాడంలో సక్సెస్ అయ్యాడ‌ని ఉమ‌ర్ సంధూ అభిప్రాయ‌ప‌డ్డాడు. టోట‌ల్‌గా ఇది ప‌క్కా ప‌వ‌ర్‌ఫుల్‌గా సాగిన పైసా వ‌సూల్ మాస్ మూవీ. మెగా ఫ్యాన్స్‌కి ఇది పండ‌గ‌లాంటి సినిమా అట‌. చిరంజీవి కెరీర్ బెస్ట్ మూవీస్‌లో ఇది కూడా ఒక‌టని ఆయ‌న క‌న్‌క్లూజ‌న్ ఇచ్చాడు. త‌ప్ప‌క చూడాల్సిన మూవీస్‌లో ఇది ఒక‌టి అని ఎండ్ కార్డ్ వేశాడు ఉమ‌ర్ సంధూ.

 

Leave a Reply

*