ఖైదీ నెంబ‌ర్ 150 మార్నింగ్ షో టాక్‌….!

న‌టీన‌టులు.. చిరంజీవి, కాజ‌ల్‌, త‌రుణ్ అరోరా, బ్రహ్మానందం, పోసాని కృష్ణ ముర‌ళి, పృధ్వీ…
సంగీతం.. దేవి శ్రీ ప్ర‌సాద్‌
కెమెరా… ర‌త్న‌వేలు
నిర్మాత‌.. రామ్‌చ‌ర‌ణ్
ద‌ర్శ‌క‌త్వం.. వివి వినాయ‌క్‌

చిరంజీవి రీ ఎంట్రీ మూవీ తొలి బొమ్మ పడింది. యూఎస్‌లో ప్రీమియ‌ర్ షోల రిపోర్ట్ వ‌చ్చింది. లాంగ్ గ్యాప్ త‌ర్వాత బాస్‌ని తెర‌పై చూసిన ఫ్యాన్స్ ఖుషీ ఫీల‌య్యారు. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ థియేట‌ర్ల‌లో అరుపులు, కేక‌ల‌తో ద‌ద్ద‌రిల్లిపోయింది. దాదాపు 9ఏళ్ల త‌ర్వాత సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసిన మెగాస్టార్ స్క్రీన్‌పై అదే మేజిక్ చేశాడంటున్నారు అభిమానులు. ఇక ఈ సినిమా రివ్యూపై వారేమంటున్నారో చూద్దాం..

ఈ మూవీలో చిరంజీవి ద్విపాత్రాభిన‌యం చేశాడు. ఒక పాత్ర‌లో రైతుల‌కు సాయ‌ప‌డే జియాల‌జిస్ట్‌గా, సౌమ్యుడిగా, వాట‌ర్ మాఫియాగా మారిన‌ కార్పొరేట్ కంపెనీల‌పై పోరాడే ఓ మేధావి వ‌ర్గానికి చెందిన వ్య‌క్తిగా క‌నిపిస్తాడు. మ‌రో పాత్ర‌లో ఆయ‌న ఖైదీగా, అల్ల‌రి చిల్ల‌రిగా తిరిగే జేబుదొంగ టైప్ రోల్‌లో ద‌ర్శ‌నమిస్తాడు. జైలు నుంచి ప్రారంభ‌మ‌య్యే ఈ క‌థ‌లో చిరంజీవి అక్క‌డినుంచి తప్పించుకుంటాడు. జైలు నుంచి పారిపోయిన ఈ ఖ‌తర్నాక్‌.. ఆ త‌ర్వాత మేధావి అయిన మ‌రో రోల్‌లో ఎలా ఎంట్రీ ఇచ్చాడు..? కార్పొరేట్ కంపెనీల ఆగ‌డాల‌కు చెక్ చెప్పి రైతుల‌కు ఎలా సాయ‌ప‌డ్డాడ‌నేదే స్టోరీ.

రెండు వైవిధ్య‌మైన పాత్ర‌ల‌లోనూ చిరు రెచ్చిపోయాడంటున్నారు అభిమానులు. డిఫ‌రెంట్ షేడ్స్ ఉన్న రోల్స్‌లో అద్భుత‌మైన పెర్‌ఫార్మెన్స్‌లో అద‌ర‌గొట్టాడ‌ని చెబుతున్నారు. రౌడీ అల్లుడు, దొంగ‌మొగుడును మ‌రోసారి గుర్తు చేశాడ‌ని ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా మేధావి చిరంజీవి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకి హైలైట్ అవుతుంద‌ని భావిస్తున్నారు. జైలు ఎపిసోడ్‌తోపాటు ఓ న‌గ‌రానికి వాట‌ర్‌ని తీసుకుపోయే పైప్‌ల‌లో రైతులు దాక్కునే సీన్‌ల‌లో వాడిన గ్రాఫిక్స్ అంద‌రికీ న‌చ్చుతాయ‌ని.. సినిమా రేంజ్‌ని పెంచే అంశాలు ఇవేనంటున్నారు. ఠాగూర్‌లో వైద్య‌వృత్తిపై చేసిన ఎపిసోడ్ ఎంత‌టి పాపుల‌ర్ అయిందో.. ఖైదీ నెంబ‌ర్ 150లో వాట‌ర్ మాఫియాపై చేసిన సీన్ కూడా అంత‌కంటే ఎలివేట్ అవుతుంద‌ని ధీమాగా ఉన్నారు.

ఇక డ్యాన్స్‌ల‌లో చిరు 90ల స్టార్టింగ్‌లోని గ్యాంగ్ లీడ‌ర్ చిరును గుర్తు చేశాడ‌ట‌.ఆ ఈజ్‌, ఆ గ్రేస్ మెగాస్టార్‌కే సాధ్యం అంటున్నారు. లారెన్స్ కంపోజ్ ర‌త్తాలు పాట‌, అమ్మ‌డు లెట్స్ డు కుమ్ముడు సాంగ్‌ల‌లోని స్టెప్పులు చిరంజీవి మార్క్ అని స్టాంప్ వేసి చెబుతున్నారు. బ్ర‌హ్మి కామెడీ ట్రాక్ పెద్ద‌గా పేల‌క‌పోయినా.. చిరంజీవి కామెడీ టైమింగ్‌లో అదుర్స్ అంటున్నారు. కాజ‌ల్‌ది చిన్న రోలే అయినా గ్లామ‌ర‌స్‌గా క‌నిపించింద‌ని అంటున్నారు. వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం సినిమాకి మ‌రో హైలైట్ అంటున్నారు.

క‌థ‌ని తెలుగు నేటివిటీకి త‌గ్గ‌ట్టు బాగా మాడిఫై చేశాడ‌ని చెబుతున్నారు. రైతుల దుస్థితిపై చేసిన పాథ‌టిక్ సాంగ్ క‌న్నీరు పెట్టించేలా ఉందంటున్నారు. ర‌త్న‌వేలు సినిమాటోగ్ర‌ఫీ ఆక‌ట్టుకుంద‌ని అంటున్నారు. రామ్‌చ‌ర‌ణ్ నిర్మాత‌గా చేసిన ఈ మూవీలో ప్రొడ‌క్ష‌న్ వేల్యూస్ అదిరిపోయాయంటున్నారు. కూతురు సుష్మిత .. చిరంజీవికి చేసిన కాస్ట్యూమ్స్ బాగా సెట్ అయ్యాయంటున్నారు. మొత్త‌మ్మీద‌, చిరంజీవికి సెకండ్ ఇన్నింగ్స్‌కి ఇది ప‌ర్‌ఫెక్ట్‌ మూవీ అని కాన్‌ఫిడెంట్‌గా ఉన్నారు అభిమానులు. టోట‌ల్‌గా ఈ సినిమా రేంజ్ ఎంత అనేది మ‌రికొద్ది రోజులు ఆగితే కానీ తేల‌దు… (ఫైన‌ల్ రివ్యూ మ‌రికాసేప‌ట్లో…)

బాట‌మ్ లైన్‌.. సింపుల్‌గా వ‌న్ వ‌ర్డ్‌లో చెప్పాలంటే బాస్ ఈజ్ బ్యాక్‌..

Leave a Reply

*