ఖైదీకి యూఎస్‌లో బిగ్ షాక్‌… రికార్డ్‌ల‌న్నీ అబ‌ద్ధ‌మా…?

ఓవ‌ర్‌సీస్‌లో చిరంజీవి రీ ఎంట్రీ మూవీలోనూ ర‌ఫ్పాడించాడు. ఏకంగా బాహుబ‌లి రికార్డ్‌ల‌ను షేక్ చేసేలా క‌నిపించాడు. ఖైదీ నెంబ‌ర్ 150కి యూఎస్‌లో భారీ వ‌సూళ్లు వ‌చ్చాయి తొలిరోజు. 1.254 మిలియ‌న్ డాల‌ర్‌లు అంటే 12.54 ల‌క్ష‌ల డాల‌ర్‌లు సాధించింది. టాలీవుడ్ ఆల్‌టైమ్ సినిమాల‌లో ఇదే సెకండ్ హ‌య్య‌స్ట్. కానీ, ఇప్పుడు ఆ మూవీకి ఊహించ‌ని ఝ‌ల‌క్ త‌గిలేలా క‌నిపిస్తోంది.ఖైదీ నెంబ‌ర్ 150కి టికెట్ ధ‌ర ప్రీమియ‌ర్ షోల‌కి 25 డాల‌ర్‌లు పెట్టారు. చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ తొలి మూవీ కావ‌డంతో ఊహించ‌ని రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమా చూడ‌డానికి ఎగ‌బ‌డ్డారు. అయితే, అస‌లు మేట‌ర్ ఏంటంటే.. ఓ యాప్ సంస్థ ఇచ్చిన భారీ ఆఫ‌ర్‌తోనే ఇంత‌టి క‌లెక్ష‌న్‌లు వ‌చ్చాయ‌ట‌.

జ‌ర్మ‌న్‌కి చెందిన ఓ టెక్నలజీ సంస్థ‌.. త‌మ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటే.. సినిమా టికెట్‌ని కేవ‌లం 2 డాల‌ర్‌ల‌కే పొందే చాన్స్ ఇచ్చింది. దీంతో, ఆ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని దాదాపు 35వేల మంది ఖైదీ నెంబ‌ర్ 150 మూవీని తిల‌కించార‌ట‌. కానీ, ఆ యాప్ చెబుతున్న‌దేంటంటే… త‌మ సంస్థ టికెట్ ధ‌ర యావ‌రేజ్‌ని మాత్ర‌మే ఇస్తామ‌ని… అంటే 9.25 డాల‌ర్‌లు మాత్ర‌మే ఇస్తామ‌ని అంటోంద‌ట‌. దీంతో, ఈ యాప్‌తో డిస్ట్రిబ్యూట‌ర్‌కు ఒక్కో టికెట్‌కి సుమారు 15 డాల‌ర్‌ల‌కుపైగా లాస్‌. అయితే, డిస్ట్రిబ్యూట‌ర్‌లు మాత్రం త‌మ‌కు టికెట్ ధర పూర్తిగా చెల్లించాల‌ని లేకుంటే కేసు ఫైల్ చేస్తామ‌ని చెబుతోంద‌ట‌. ఇలా, ఈ వివాదం ఇప్పుడు చిలికి చిలికి గాలివాన‌గా మారే చాన్స్ క‌నిపిస్తోంది.

ఇలా అయితే, డిస్ట్రిబ్యూట‌ర్‌ల‌కు భారీ లాస్‌. మ‌రి, ఈ న‌ష్టాన్ని ఎవ‌రు భ‌రిస్తారు అనేది హాట్ టాపిక్‌గా మారుతుంది. అలా చూసుకుంటే… ఖైదీ నెంబ‌ర్ 150 రికార్డ్‌లు కూడా చెదిరిపోతాయి. దీంతో, ఖైదీ వ‌సూళ్లు 5-6 ల‌క్ష‌ల డాల‌ర్‌లు కూడా ఉండ‌వని.. ఈ హైప్ అంతా అబ‌ద్ధ‌మ‌ని అంటున్నారు కొంద‌రు యాంటీ మెగా ఫ్యాన్స్‌. మ‌రి, ఈ వివాదానికి ఎలా ఫుల్ స్టాప్ ప‌డుతుంద‌నేదే ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Leave a Reply

*