ప్చ్..శాతకర్ణికి అదే దెబ్బెసిందిగా..!!

నందమూరి బాలకృష్ణ నటించిన ‘గౌతమి పుత్రా శాతకర్ణి’ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజై హిట్ టాక్ ను అందుకుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాపతంగా బాలయ్య ఫ్యాన్స్ అంతా జై బాలయ్య నినాదాలతో థియేటర్స్ బద్దలయ్యేలా గోల చేస్తున్నారు. అమరావతిని ఏలిన రాజైన శాతకర్ణి చరిత్రను తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు డైరెక్టర్ క్రిష్. ఇక గుర్రపు స్వారీలతో పాటు, యుద్ధ సన్నివేశాలు, మదర్ సెంటిమెంట్ ను బాగా పండించిన ఈ సినిమా సంక్రాంతికి ఫుల్ మీల్స్ తిన్నంతగా ఉందని చెప్తున్నారు సినీ పెద్దలు.

మరి కొందరు మాత్రం శాతకర్ణి టేకింగ్, ప్రొడక్షన్ వ్యాల్యూస్ అన్నీ బాగున్నప్పటికీ అందులో ఒక ఒక్కటి మాత్రం పెద్ద మైనస్ గా మారిందని చెప్తున్నారు. అదే కథ నిడివి. మాములుగా అయితే చారిత్రాత్మక చిత్రాలు తెరకెక్కించే సమయాల్లో నిడివి చాలా తక్కువగా ఉండేలా ప్లాన్ చేస్తారు. ఇక్కడ కూడా క్రిష్ దాన్నే ఫాలో అవుతూ..సమయాన్ని తగ్గించాడు. ఇదే సినిమాపై దెబ్బెసిందని మాట్లాడుకుంటున్నారు.

ఎక్కడికక్కడ సీన్స్ ను మరీ అలా కట్ చెయ్యకుండా, ఇంకొంచెం ఎలివేట్ చేసి ఉంటే బాగుండేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్స్, క్లైమాక్స్ బ్యాంగ్ వంటి విషయాల్లో క్రిష్ కాస్త శ్రద్ధ వహించి ఉంటే సినిమా ఎక్కడికో వెళ్ళేదనే మాట వినిపిస్తోంది. మొత్తానికి ఈ సంక్రాంతికి బాలయ్య హిట్ అందుకున్నాడనే చెప్పాలి!

Leave a Reply

*