గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి మార్నింగ్ షో టాక్‌…!!

న‌టీన‌టులు.. బాల‌కృష్ణ‌, శ్రియా, హేమ‌మాలిని, క‌బీర్ బేడి..
సినిమాటోగ్ర‌ఫీ.. జ్ఞానేశ్వ‌ర్‌
మ్యూజిక్‌.. చిరంత‌న్ భ‌ట్‌
డైలాగ్‌లు.. సాయిమాధ‌వ్ బుర్రా
పాట‌లు.. సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి
నిర్మాత‌.. వై. రాజీవ్ రెడ్డి-జాగ‌ర్ల‌మూడి సాయిబాబు
క‌థ‌-ద‌ర్శ‌క‌త్వం.. జాగ‌ర్ల‌మూడి క్రిష్‌

బాల‌య్య కెరీర్‌లోనే ప్రిస్టీజియ‌స్ మూవీ గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి. కెరీర్‌లో ఆయ‌న‌కు ఇది వందో చిత్రం. అంటే ఇది ఆయ‌న‌కు మైల్‌స్టోన్ మూవీ. అంతేకాదు, రెండున్న‌ర ద‌శాబ్దాల త‌ర్వాత బాల‌య్య న‌టించిన చారిత్రాత్మక చిత్రం కావ‌డంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. గతంలో ఆదిత్య 369లో శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌ల పాత్ర పోషించి అల‌రించాడు. వైవిధ్య‌మైన క‌థ‌ల‌తో విలక్ష‌ణ ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్న క్రిష్ ఈ మూవీ డైరెక్ట‌ర్‌. గ‌తంలో ఆయ‌న కంచె వంటి వార్ బేస్డ్ సినిమా చేశాడు. దీంతో, బాల‌య్య‌-క్రిష్ కాంబినేష‌న్ అన‌గానే ఎక్స్‌పెక్టేష‌న్స్ రెట్టింప‌య్యాయి. ఇటు, తెలుగు జాతి గ‌ర్వించ‌ద‌గ్గ వీరుడు గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి జీవిత‌గాథ ఆధారంగా తెర‌కెక్కిన చిత్రం కావ‌డంతో సినిమాపై ఎన‌లేని క్రేజ్ ఏర్ప‌డింది. ఇంత‌కీ ఈ సినిమా ఎలా ఉంది..? అనేది ఇప్పుడు చూద్దాం..

క‌థ‌..!
శాత‌వాహనుల రాజుల‌లో గొప్ప వాడ‌యిన గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి జీవిత‌గాధ ఆధారంగా తెర‌కెక్కింది ఈ చిత్రం. మౌర్యుల ప‌రిపాల‌న త‌ర్వాత అఖండ భార‌తాన్ని ఏకం చేసిన రాజు ఆయ‌నే. తెలుగు జాతి ఔన్న‌త్యాన్ని ద‌శ‌దిశ‌లా వ్యాపింప జేయాల‌ని భావించిన గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి రాజ‌సూయ యాగం ప్రారంభిస్తాడు. త‌న సామ్రాజ్యాన్ని, శాత‌వాహ‌న జెండాని అఖండ భారతంపై ఎగ‌ర‌వేయాల‌నేది ఆయ‌న ల‌క్ష్యం.. దీనికి ఎదురు వ‌చ్చిన రాజుల‌ను, శ‌త్రు సేన‌ల‌ను తుర‌మ‌డం, త‌ర‌మ‌డం అనే ఆశ‌యంతో యుద్దాల‌కు తెగ‌బ‌డ‌తాడు. ఇంత‌కీ, శాత‌క‌ర్ణి త‌న ల‌క్ష్యాన్ని సాధిస్తాడా..? లేదా..? అనేదే సినిమా క‌థ‌..

న‌టీన‌టుల పెర్‌ఫార్మెన్స్‌…
గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి పాత్ర‌కు బాల‌కృష్ణ బాగా సెట్ అయ్యాడు. తెలుగులో ఈ జ‌న‌రేష‌న్‌ల చారిత్ర‌క‌, జాన‌ప‌ద సినిమాలు చెయ్యాలంటే ఆయ‌నే ది బెస్ట్ అని మ‌రోసారి ప్రూవ్ చేశాడు. భారీ డైలాగులు, ఆవేశంతో కూడిన సంద‌ర్భోచిత సీన్‌ల‌లో బాల‌య్య మాస్ యాక్టింగ్ ఆడియెన్స్‌కు బాగా క‌నెక్ట్ అయింది. ఈ పాత్ర‌కు క్రిష్ బాల‌కృష్ణ‌నే ఎంచుకోవ‌డంలోనే వంద‌కు వంద శాతం సక్సెస్ అయిన‌ట్టు అనిపిస్తోంది. త‌న క‌థ‌లో ఎక్కువ‌గా వార్ బేస్డ్ సీన్‌లు, ఆవేశపూరితం, ఎమోష‌న‌ల్ డైలాగులు ఉండ‌డంతో బాల‌య్య కోస‌మే ఆ పాత్ర‌ను ఎన్టీఆర్ గ‌తంలో న‌టించ‌కుండా ఉన్నాడ‌ని అనిపిస్తుంది. కొన్ని సీన్‌ల‌లోని డైలాగుల‌లో ప్రేక్ష‌కులు బాల‌య్య‌కు హ్యాట్సాఫ్ చెప్ప‌కుండా ఉండ‌లేరు. అంత‌లా క‌నెక్ట్ అయ్యాడు.

ఇక శాత‌క‌ర్ణి త‌ల్లి గౌతమిగా న‌టించిన బాలీవుడ్ డ్రీమ్‌గర్ల హేమ‌మాలిని న‌ట‌న బావుంది. తల్లి సెంటిమెంట్‌తో నిండిన సినిమా కావ‌డంతో… ఆ పాత్ర బాగా పండింది. త‌న పేరుముందు గౌత‌మీపుత్ర అని యాడ్ చేసుకునే సంద‌ర్భంలో అమ్మ గురించి చెప్పిన డైలాగులు కంట‌త‌డి పెట్టిస్తాయి. అంత వెయిటేజ్ పాత్ర హేమ‌మాలినిది. వాశిష్టిదేవిగా న‌టించిన శ్రీయాకు రీసెంట్‌గా ఇది మంచి రోల్‌. ఆమె కెరీర్ దాదాపు క్ల‌యిమాక్స్ అనుకుంటున్న టైమ్‌లో వాశిష్టీదేవి పాత్ర ఆమెకు కెరీర్‌లో మ‌రిచిపోలేని పాత్ర‌గా మిగులుతుంది.

సాంకేతిక విభాగం..
గౌత‌మీపుత్ర శాత‌కర్ణి వంటి యుద్ధ నేప‌థ్యంలో సాగే సినిమాని కేవ‌లం 79రోజులలోనే సినిమా షూటింగ్ పూర్త‌యిందంటే అది కేవ‌లం టెక్నిక‌ల్ టీమ్‌తోనే సాధ్య‌మ‌వుతుంద‌న‌డంలో సందేహం లేదు. ప్ర‌తి విభాగం కూడా అద్భుతంగా ప‌నిచేసింది. ముందుగా జ్ఞానశేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ సినిమా రేంజ్‌ని పెంచింది. ప్ర‌తి ఫ్రేమ్‌ని విజువ‌ల్లీ వండ‌ర్‌ఫుల్‌గా తెర‌కెక్కించాడు. ముఖ్యంగా శాత‌వాహ‌నుల రాజ‌వైభ‌వాన్ని క‌ళ్ల‌కు క‌ట్టే సీన్‌ల‌తోపాటు వార్ సీన్‌ల‌ను అద్భుతంగా బంధించాడు. యుద్ధ‌స‌న్నివేశాల‌లో జ్ఞానశేఖ‌ర్ ప‌నిత‌నాన్ని మెచ్చుకోకుండా ఉండ‌లేరు. ఆయ‌న‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

భూపేష్ భూప‌తి ఆర్ట్ వ‌ర్క్ సినిమాకి మ‌రో అడ్వాంటేజ్‌. శాతవాహ‌న సామ్రాజ్యం, క‌ళ‌లు, శిల్పాలు.. అమ‌రావ‌తి వైభ‌వం, వైభోగం, యుద్ధ స‌న్నివేశాలపై భూప‌తి ఆర్ట్ వ‌ర్క్ మార్వెలెస్‌గా సాగింది. స్క్రీన్‌పై ప్ర‌తి ఫ్రేమ్‌ని విజువ‌ల్‌గా అందంగా క‌నిపించేలా భూప‌తి తీసుకున్న కేర్‌ని మెచ్చుకోకుండా ఉండ‌లేం. ఇక‌, చిరంత‌న్ భ‌ట్ మ్యూజిక్ కూడా బావుంది. ముఖ్యంగా రీ-రికార్డింగ్‌పై ఆయ‌న తీసుకున్న శ్ర‌ద్ధ సినిమాకి క‌లిసొచ్చింది. వార్ సీన్‌లలో ఆర్ ఆర్ అదిరిపోయింది.

ఇది పూర్తిగా వార్ బేస్డ్ మూవీ. దీంతో, యుద్ధాలే సినిమాకి హైలైట్‌గా మారాయి. వాటిని తెర‌కెక్కించ‌డంలో రామ్-ల‌క్ష్మ‌ణ్ అద్భుతంగా రాణంచారు. ముఖ్యంగా వార్ సీన్‌ల‌లో వారి టాలెంట్ క్లియ‌ర్‌గా క‌నిపిస్తుంది. న‌హ‌పాలుడుతో యుద్ధంతోపాటు ఇంట‌ర్వెల్ సీన్‌లో వ‌చ్చే యుద్ధ స‌న్నివేశాల‌ను వారు చూపిన నేర్పు మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది.

డైలాగ్స్‌:
డైలాగ్ రైట‌ర్ బుర్రా సాయిమాధ‌వ్‌ని క్రిష్ ఎందుకు ఎంచుకున్నాడో సినిమా చూస్తే అర్ధం అవుతుంది. ప్ర‌తి డైలాగ్ బాగా పేలింది. బాల‌య్య ఆ డైలాగులు చెబుతుంటే.. విజిల్ వేయాల్సిందే.. అంత‌లా త‌న క‌లాన్ని క‌దిలించి, ప్రేక్ష‌కుల‌ను క‌దిలించాడు బుర్రా సాయి మాధ‌వ్‌.. థియేట‌ర్‌లో ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అయిన డైలాగుల‌లో కొన్ని..

— నేను బొట్టు పెట్టింది నా భ‌ర్త‌కు కాదు.. ఓ చరిత్ర‌కు..
— మ‌గ‌నాలికి గాజులు అందం…మ‌గాడికి గాయాలు అందం
— ఆడ‌దాని క‌డుపులో న‌లిగి న‌లిగి వెలుగు చూసిన ర‌క్త‌పు ముద్ద‌వి
— నా రాజ్యంలో పాలించ‌డానికి కాదు…యాచించ‌డానికి కూడా అనుమ‌తించ‌ను
— మ‌నం క‌థ‌లు చెప్ప కూడ‌దు…మ‌న క‌థ‌లు జ‌నం చెప్పుకోవాలి
— మారావు అనుకున్నా…గెలిచిన రాజ్యాలు మార్చ‌లేదు…వ‌ల‌చిన ఇల్లాలు మార్చ‌లేదు
— మ‌నం క‌థ‌లు చెప్ప కూడ‌దు…మ‌న క‌థ‌లు జ‌నం చెప్పుకోవాలి

ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌..
తెలుగు సినిమా చ‌రిత్ర‌లో క్రిష్‌కు ప్ర‌త్యేక స్థానం ఉంటుంది అని చెప్పే సినిమా ఇది. టాలీవుడ్ ఆల్‌టైమ్ గ్రేట్ డైరెక్ట‌ర్‌ల జాబితాలో క్రిష్ పేరు ఉంటుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. గాయం, వేదం సినిమాలు క్రిష్‌ని వైవిధ్య‌, విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడిగా నిల‌బెడితే.. కంచెతో త‌న రేంజ్‌ని మ‌రింత పెంచుకున్నాడు. ఇక, శాత‌క‌ర్ణి మూవీ ఆయ‌న‌ను గొప్ప ద‌ర్శ‌కుల‌లో ఒకడిగా నిలుపుతుందంటున్నారు విశ్లేష‌కులు. ఇంత త‌క్కువ టైమ్‌లో శాత‌క‌ర్ణిని ఆయ‌న తెర‌కెక్కించిన విధానం.. ఆక‌ట్టుకుంది.

బాట‌మ్‌లైన్‌… సాహో శాత‌క‌ర్ణి…! తెలుగు జాతి గ‌ర్వించే సినిమా..
(ఫైన‌ల్ రివ్యూ మ‌రికాసేప‌ట్లో…)

Leave a Reply

*