గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి ప్రివ్యూ టాక్‌…!!

న‌టీన‌టులు.. బాల‌కృష్ణ‌, శ్రియా, హేమ‌మాలిని
సినిమాటోగ్ర‌ఫీ.. జ్ఞానేశ్వ‌ర్‌
మ్యూజిక్‌.. చిరంత‌న్ భ‌ట్‌
డైలాగ్‌లు.. సాయిమాధ‌వ్ బుర్రా
పాట‌లు.. సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి
నిర్మాత‌.. వై. రాజీవ్ రెడ్డి-జాగ‌ర్ల‌మూడి సాయిబాబు
క‌థ‌-ద‌ర్శ‌క‌త్వం.. జాగ‌ర్ల‌మూడి క్రిష్‌

బాల‌య్య కెరీర్‌లోనే ప్రిస్టీజియ‌స్ మూవీ గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి. కెరీర్‌లో ఆయ‌న‌కు ఇది వందో చిత్రం. అంటే ఇది ఆయ‌న‌కు మైల్‌స్టోన్ మూవీ. అంతేకాదు, చారిత్రాత్మక చిత్రం కావ‌డంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. ఈ సినిమా తాజాగా సెన్సార్ పూర్త‌యింది. ఈ సినిమా ర‌న్‌టైమ్ సుమారు 2 గంట‌ల 17నిముషాలు. సినిమా చూసి సెన్సార్ స‌భ్యులు ఆనందంగా ఫీల‌య్యార‌నే మాట వినిపించింది. తెలుగు తెర‌పై ఇలాంటి సినిమాలు అరుదుగా వ‌స్తాయ‌ని, క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం మోడ‌ర్న్ క్లాసిక్‌గా నిలుస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నార‌ట‌. అంత‌గా వారి మెప్పును పొందింద‌ని స‌మాచారం.

శాత‌వాహనుల రాజుల‌లో గొప్ప వాడ‌యిన గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి జీవిత‌గాధ ఆధారంగా తెర‌కెక్కింది ఈ చిత్రం. మౌర్యుల ప‌రిపాల‌న త‌ర్వాత అఖండ భార‌తాన్ని ఏకం చేసిన రాజు ఆయ‌నే. ద‌క్షిణాది భార‌త దేశ చ‌క్ర‌వ‌ర్తుల‌లో ఒక్క గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణినే దేశం మొత్తాన్ని ప‌రిపాలించాడ‌ని చరిత్రకారులు చెబుతున్నారు. ఉత్త‌ర భార‌తం నుంచి వ‌స్తున్న విదేశీ దండ‌యాత్ర‌ల‌నుంచి దేశాన్ని కాపాడి… యుద్ధ‌పిపాసి అయిన శాత‌క‌ర్ణి దేశాన్ని ఎలా కాపాడాడు…? అనేది సినిమా క‌థ‌.

శాత‌వాహ‌నుల రాజు క‌థ‌తో తీసిన గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణిలో ప్ర‌తి విభాగం బాగా హైలైట్ అయింద‌ట‌. బాల‌య్య ఫెరోషియ‌స్‌ పెర్‌ఫార్మెన్స్ సినిమాకి బాగా అడ్వాంటేజ్‌గా మారింద‌ట‌. వీర‌త్వం, మ‌ద‌ర్ సెంటిమెంట్‌, రొమాన్స్‌తోపాటు న‌వ‌ర‌సాలు క‌లిసిన సీన్‌ల‌ను క్రిష్ అద్భుతంగా తెర‌కెక్కించాడ‌ని స‌మాచారం. ప్ర‌తి ఫ్రేమ్ రిచ్‌గా సాగింద‌ని, విజువల్ వండ‌ర్‌గా తీర్చిదిద్దాడ‌నే మాట వినిపిస్తోంది.

ఈ మూవీలో రెండు సీన్‌లకు థియేట‌ర్లు బ‌ద్దలవుతాయ‌నే మాట వినిపిస్తోంది. ఆ రెండు సీన్‌ల‌లో ఒక‌టి… స‌ముద్ర తీరంలో యుద్ధం.. ఈ సీన్ మొత్తాన్ని గ్రీన్‌మ్యాట్‌పై చిత్రీక‌రించాడు ద‌ర్శ‌కుడు క్రిష్‌. సుమారు 10నిముషాల పాటు సాగే ఈ సన్నివేశం మినీ క్ల‌యిమాక్స్‌లా ఉంటుంద‌ట‌. శాత‌వాహ‌న రాజుల ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించే స‌న్నివేశం ఇదేన‌ట‌.

ఇక‌, రెండో సీన్‌… సింహాన్ని లొంగ‌దీసి దానిని స్వారీ చేసే సీన్‌. మృగ‌రాజు సింహంతో పోరాడి.. జూలు ప‌ట్టుకొని దాని మీద స్వారీ చేస్తూ అంతఃపురం వ‌ర‌కు వ‌స్తాడ‌ట బాల‌య్య‌. ఈ సీన్ మ‌రో హైలైట్ అంటున్నారు. ఈ రెండు స‌న్నివేశాల‌ను ద‌ర్శ‌కుడు క్రిష్‌.. అత్య‌ద్భుతంగా తెర‌కెక్కించాడ‌ట‌. మొత్తం సినిమాలో ఇలాంటి సన్నివేశాలు మ‌రో మూడు నాలుగున్నాయ‌ని, గ్రీకు రాజుల‌తో చేసే యుద్ధంతోపాటు, మ‌ద‌ర్ సెంటిమెంట్ కూడా అడ్వాంటేజ్ అవుతుంద‌ని అంచ‌నా వేస్తున్నార‌ట ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. సంక్రాంతికానుక‌గా విడుద‌ల‌కానున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. మ‌రి, వందో సినిమాతో బాల‌య్య రికార్డ్‌లు తిర‌గ‌రాస్తాడా..? లేదా..? అనేది చూడాలి.

Leave a Reply

*