ఆర్టిస్ట్ తో బూతులు తిట్టించిన రవి..స్టేజ్ వదిలిన శ్రీముఖి..!

పటాస్ ప్రోగామ్ కి వచ్చిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. అది అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం యాంకర్స్ అయిన రవి-శ్రీముఖి అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇక వాళ్ళు మాట్లాడుకునే డబుల్ మీనింగ్ మాటలే ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఇప్పటికే అలా మాట్లాడుకుంటూ పలు మార్లు ఆడియన్స్ కంట్లో పడ్డ వీళ్లిద్దరూ.

కానీ తాజాగా జరిగిన సంఘటన వల్ల మాత్రం అందరూ షాకయ్యారు. రవి ఎన్ని మాటలు అన్నా సరే నవ్వుతూనే ఉండే శ్రీముఖి, ఇప్పుడు మాత్రం సీరియస్ అయ్యింది! అంతే కాదు షో విడిచి వెళ్ళింది కూడా!అసలేం జరిగిందంటే..ముందుగా ఒక అబ్బాయి స్టేజ్ మీదకి వచ్చి ఒక జోక్ చెప్తాడు. అది పెలకపోయినా సరే పడీ పడీ నవ్వుతుంది శ్రీముఖి.

దీంతో వెంటనే సీన్ లోకి ఎంటరైన రవి..బురదలో పంది పోల్లాడుతుంది..నీ నవ్వు అలాగే ఉంది..నీ నవ్వు ఆపు వినలేక చస్తున్నాం..అని ఆర్టిస్ట్ చేత అనిపిస్తాడు రవి. దీంతో హర్ట్ అయిన శ్రీముఖి..వెంటనే స్టేజ్ వదిలి వెళ్ళిపోతుంది. దీంతో ఏది అన్నా కూడా నవ్వుతూనే ఉండే శ్రీముఖి, ఇప్పుడు అంత సీరియస్ అయ్యిందీ అంటే..ఆఫ్ స్క్రీన్ ఏదో జరిగిందని మాట్లాడుకుంటున్నారు పటాస్ ప్రేక్షలుకు.

Leave a Reply

*