కాజల్‌వి పెట్టుడు అందాలా.. నిజ‌మైన‌వి కావా…?

టాలీవుడ్‌లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ మొద‌ల‌యింది. రీసెంట్‌గా కాజ‌ల్ ఓ ఇంట‌ర్‌వ్యూలో చేసిన కామెంట్స్ అస‌లు రగ‌డకు కార‌ణ‌మ‌య్యాయి. ఇంత‌కీ ఆమె ఏం అన్నారంటే…. ప్లాస్టిక్ స‌ర్జ‌రీ చేయించుకుంటే త‌ప్పేంటి… అవి కూడా అందాలే క‌దా..? అని వ్యాఖ్యానించారు. దీంతో, అస‌లు కాంట్ర‌వ‌ర్శీ మొద‌ల‌యింది.

కాజ‌ల్ వ్యాఖ్య‌ల‌తో ఆమెవి అస‌లైన అందాలు కావ‌ని, పెట్టుడు అందాల‌ని, ఆమె పెదాలు, ముక్కు ప్లాస్టిక్ స‌ర్జ‌రీ చేయించుకుంద‌ని కొంద‌రు అంటున్నారు. మ‌రికొంద‌ర‌యితే ఆమె స‌య్యెద అందాల‌కి స‌ర్జ‌రీ చేయించుకొని ఫిగ‌ర్‌ని వ‌ర్క‌వుట్ చేయించుకుంద‌ని కామెంట్ చేస్తున్నారు. ప్లాస్టిక్ అందాల‌ను కొని తెచ్చుకోవ‌డం మ‌న హీరోలు, హీరోయిన్‌ల‌కు కొత్తేం కాదు. గ‌తంలో అతిలోక సుంద‌రి శ్రీదేవి, శిల్పా శెట్టి వంటి క‌థానాయిక‌లంతా ఇలా అందాల‌ను అరువు తెచ్చుకున్నవారేన‌ని గుర్తు చేస్తున్నారు. వాళ్ల ఒరిజినాలిటీకి మ‌రికాస్త ఎక్ స్ట్రా ప్యాడింగ్‌ని అరేంజ్ చేసుకుంటున్నార‌ని చెప్పుకుంటున్నారు. ఇలానే కాజ‌ల్ బ్యూటీ కూడా డాక్ట‌ర్స్ చెక్కిన‌దేన‌ని వ్యాఖ్యానిస్తున్నారు.

ఇదంతా అబ‌ద్ధ‌మ‌ని, కేవ‌లం కొందరు హీరోయిన్‌లకి మ‌ద్ద‌తుగానే ఆమె ఈ వ్యాఖ్య‌లు చేసింది త‌ప్ప‌.. కాజ‌ల్ అందాలు గాడ్ గిఫ్ట్ అని, ఆమెది స‌హ‌జ సౌంద‌ర్య‌మ‌ని సపోర్ట్ చేస్తున్నారు. ఇందులో ఏది నిజమో ఏది అబద్ధ‌మో ఆమెకి, ఆమెను సృష్టించిన బ్ర‌హ్మకి, ఆ డాక్ట‌ర్‌ల‌కే తెలియాలి..

 

Leave a Reply

*