హేమ ఆంటీ పంచ్‌కి దెబ్బ‌కి బిత్త‌ర‌పోయిన రోజా…!

న‌టి హేమ‌… తెలుగు సినిమాలు చూసేవారికి బాగా పాపుల‌ర్ అయిన ఫేస్‌. క్ష‌ణ‌క్ష‌ణం వంటి సినిమాల‌లో చిన్న చిన్న రోల్స్ చేసిన హేమ కెరీర్‌.. నువ్వు నాకు న‌చ్చావ్ మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసింది. ఈసినిమా త‌ర్వాత ఆమె కెరీర్ గ్రాఫ్ పెరిగింది. మంచి హెయిట్‌, హెయిట్‌కి త‌గ్గ వెయిట్‌తో హేమకి ఆంటీ, అక్క‌, వ‌దిన‌, అత్త కేర‌క్ట‌ర్‌లు బాగానే వ‌చ్చాయి. దీంతో, ఆమె పొలిటిక‌ల్‌గా కూడా రాణించాల‌ని మాజీ ముఖ్యమంత్రి కిర‌ణ్ కుమార్ స్థాపించిన జై స‌మైక్యాంధ్ర పార్టీ త‌ర‌ఫున పోటీ చేసి ఓడిపోయింది.

ఒక్క‌సారి ఓడిపోయినా ఆమెలో రాజ‌కీయ కాంక్ష త‌గ్గ‌లేదు. అధ్య‌క్షా అని మైకు ప‌ట్టుకొని ఒక్క‌సార‌యినా అసెంబ్లీలో అనాల‌నేది ఆమె కోరిక‌ట‌. అందుకే, రీసెంట్‌గా ఆమె కాపు రిజ‌ర్వేష‌న్‌ల అంశంపై పోరాడుతోంది. టీడీపీని విమ‌ర్శిస్తూ మైలేజ్ పెంచుకోవాల‌ని చూస్తోంది. త్వ‌రలోనే ఆమె వైఎస్సార్‌సీ తీర్ధం పుచ్చుకోవడానికి రెడీ అవుతుంద‌ని స‌మాచారం. అందుకే, చంద్ర‌బాబుపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతోంద‌ట హేమ‌.

ఇలా పొలిటిక‌ల్‌గా కొత్త దారులు వెతుకుతున్న హేమ‌.. కాపు రిజర్వేష‌న్‌ల అంశాన్ని ఎంచుకోవ‌డం ఆమెకు మంచి అడ్వాంటేజ్ అవుతుంద‌ని భావిస్తున్నారు పొలిటిక‌ల్ ఎన‌లిస్ట్‌లు. ఈ స్ట్రాట‌జీ చూసి వైఎస్సార్‌సీ మ‌హిళా నేత రోజా కూడా షాక్ తిన్నార‌ట‌. సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కురాలిగా హేమ మంచి అంశాన్ని ఎత్తుకున్నార‌ని అన్నార‌ట‌. త్వర‌లోనే ఆమె మ‌రింత ప‌రిణతి చెందిన రాజ‌కీయ వేత్తలా మారుతుంద‌ని రోజా కితాబిచ్చార‌ట‌. ఇలా, రోజాకే షాక్ ఇచ్చింది హేమ‌.

Loading...

Leave a Reply

*