ఆ సీఎం అంటే కాకుల‌కు ఎంత క‌సో?

ఈగ ప‌గ‌బ‌డుతుందా? ఈగ సినిమాలో సుదీప్‌కు ముందు డౌటొస్తుంది. త‌రువాత అదే నిజ‌మ‌వుతుంది. ఈగ త‌న ప‌గ తీర్చుకుని సుదీప్‌ను చంపేస్తుంది. ఇది ఈగ సినిమా క‌థాంశం. మ‌రి నిజ‌జీవితంలో కాకులు ప‌గ‌బ‌డ‌తాయా? అదీ ఒక ముఖ్య‌మంత్రిపై..ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య‌పై కాకులు ప‌గ‌బ‌ట్టాయ‌ని క‌న్న‌డ‌నాట పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సిద్ధూ అభిమానులు కాకులు త‌మ అభిమాన నేత‌పై ఎందుకు ప‌గ‌బ‌ట్టాయో అర్థంకావ‌డంలేద‌ని ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. గ‌తంలో ముఖ్య‌మంత్రి కారుపై కాకి […]

నోట్ల ర‌ద్దుపై మోదీకి షాక్ ఇచ్చిన బ్యాంక్‌లు….!!

నోట్ల ర‌ద్దు నిర్ణ‌యంతో చాలా చేయాలని క‌లలు క‌న్నారు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ. ల‌క్ష‌ల కోట్ల‌లో బ్లాక్‌మ‌నీ బ‌య‌ట‌ప‌డుతుంద‌ని దీంతో, అటు బ్యాంకింగ్ రంగ వ్య‌వ‌స్థ‌ను చ‌క్క‌దిద్ది అనేక స్కీమ్‌లు పెట్టి జ‌నాల‌ను ఆక‌ర్షించాల‌ని ఎత్తులు వేశారు. అందుకే, అవినీతిపై స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్స్ అంటూ మోదీ తీసుకున్న నిర్ణ‌యాన్ని పొగిడే ప్ర‌య‌త్నంలో ప‌ట్టారు క‌మ‌ల‌నాధులు. చివ‌ర‌కు మోదీకి బ్యాంక్‌లే ఝ‌ల‌క్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. జ‌మ అయిన పాత నోట్ల‌ను కొన్ని బ్యాంక్‌లు ఎక్కువ చేసి చూపించాయ‌ట‌. కొన్ని […]

టీడీపీలోకి మంచు ఫ్యామిలీ.. రోజాపై పోటీకి సై……!!

మోహ‌న్‌బాబు ఫ్యామిలీ టీడీపీలోకి ఎంట్రీ ఇవ్వ‌బోతుందా..? డైలాగ్ కింగ్ గారాల ప‌ట్టి మ‌ంచు ల‌క్ష్మీ వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో టీడీపీ త‌ర‌ఫున పోటీ చేయ‌నున్నారా..? అంటే అవున‌నే మాట వినిపిస్తోంది. రీసెంట్‌గా మోహ‌న్‌బాబు చంద్ర‌బాబును ప‌ర్స‌న‌ల్‌గా క‌ల‌వ‌డం, సుమారు గంట‌కుపైగా చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డం ఈ వార్త‌కు బలాన్ని ఇస్తోంది. అయితే, ఆమె ఎక్క‌డినుంచి పోటీ చేయ‌నున్న‌ది..? అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఎక్క‌డినుంచో కాద‌ట‌.. రోజా ప్రాతినిధ్యం వ‌హిస్తున్న చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ త‌ర‌ఫున ఆమె […]

4 ల‌క్ష‌ల‌కు ఐటీ మిన‌హాయింపు పెంపు?

నోట్ల ర‌ద్దుతో అస్త‌వ్య‌స్త‌మైన ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దేందుకు కేంద్రం అష్ట‌క‌ష్టాలు ప‌డుతోంది. సుమారు 50 రోజుల‌పాటు న‌ర‌క‌యాత‌న అనుభ‌వించిన ప్ర‌జ‌లు ప్ర‌భుత్వంపై తీవ్ర వ్య‌తిరేకత పెంచుకున్నారు. దీనిని తాత్కాలికంగా తాయిలాలిచ్చి శాంతింప‌జేయాల‌నే ఆలోచ‌న‌తో కేంద్రం వుంద‌ని స‌మాచారం. త్వ‌ర‌లో ప్ర‌వేశ‌పెట్ట‌బోయే బ‌డ్జెట్‌లో రాయితీలు, తాయిలాలు బాగానే వుంటాయ‌ని ఆర్థిక‌రంగ నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. ఇందులో మిడిల్‌క్లాస్ వారికి ఎంతో ఉప‌యోగ‌ప‌డే ఆదాయ‌ప‌న్ను మిన‌హాయింపు ప‌రిమితి ఒక‌టి అని తెలుస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కూ రెండున్న‌ర ల‌క్ష‌ల ఆదాయం వ‌ర‌కే ప‌న్ను మిన‌హాయింపు […]

నారా వారి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయ నేత‌లు అస్స‌లు సిగ్గుప‌డ‌టం లేదు. క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేర‌యిన తెలుగుదేశం పార్టీ జాతీయాధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు పార్టీలో క్ర‌మ‌శిక్ష‌ణారాహిత్యం, కాంగ్రెస్ మార్క్ ప్ర‌జాస్వామ్యం ప‌రిఢ‌విల్లుతోంద‌ని ఇటీవ‌ల సంఘ‌ట‌న‌లు నిరూపిస్తున్నాయి. సినీ వ్యామోహం, ప్ర‌చార ఆర్భాటం కోసం ప‌రిత‌పించుపోతున్న తెలుగుదేశం నాయ‌కులు ఒక్కొక్క‌రూ త‌మ ముసుగులు తీసేస్తున్నారు. స‌ర‌దాకి, సంద‌డికి అనుకోవ‌చ్చు. కానీ కొన్ని ల‌క్ష‌ల మందికి ప్ర‌తినిధిగా ఎన్నికైనా ప్ర‌జాప్ర‌జాప్ర‌తినిధులు..కోట్లాది మంది చూస్తార‌ని సిగ్గులేకుండా.. త‌మ ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తూ పార్టీ ప‌రువు బ‌జారున ప‌డేస్తున్నార‌ని సీనియ‌ర్ […]

జ‌గ‌న్‌కి హ్యాండ్‌.. టీడీపీలోకి మోహ‌న్‌బాబు..!

మోహ‌న్‌బాబు.. కొన్ని నెల‌ల క్రితం ఓ ప్రెస్ మీట్ పెట్టాడు గుర్తుందా..? త్వ‌ర‌లోనే త‌న రాజ‌కీయ జీవితంపై ఓ నిర్ణ‌యం తీసుకోబోతున్నాన‌ని ప్ర‌క‌టించాడు. ఇటు, చంద్ర‌బాబు, అటు జ‌గ‌న్‌.. ఇద్ద‌రూ త‌నకు బంధువులేన‌ని.. అయితే, తన రాజ‌కీయ పునః ప్ర‌వేశం మాత్రం బంధుత్వం ప్ర‌కారం కాకుండా.. ప్ర‌జాసేవ ఆధారంగానే జ‌రుగుతుంద‌ని ఆయ‌న సెలవిచ్చారు. త‌న‌కు కులాభిమానాలు లేవ‌ని, తాను ఏ పార్టీలో చేరినా… అది సామాజిక వ‌ర్గం కోసం కాద‌ని తెలిపారు. ఇదంతా గ‌తం. ఆయ‌న ఇలా […]

డీల్ కుదిరింది..జ‌గ‌న్ పార్టీలోకి డీఎల్?

  మాజీ మంత్రి డీఎల్ ర‌వీంద్రారెడ్డితో జ‌గ‌న్‌కు డీల్ కుదిరింది. ఇక ఫ్యాన్ పార్టీలో చేర‌డ‌మే మిగిలింద‌నే టాక్ వినిపిస్తోంది. న‌ల్లారి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి హ‌యాంలో మంత్రిగా ప‌నిచేసి బ‌ర్త‌ర‌ఫ్ అయిన డీఎల్ ర‌వీంద్రారెడ్డి.. ఆ త‌రువాత అటు ఇటు ఊగిస‌లాట ధోర‌ణి ప్ర‌ద‌ర్శించారు. కానీ ఏ పార్టీలో చేర‌లేదు. అయితే ఇటీవ‌ల తెలుగుదేశం పార్టీ క‌డ‌ప జిల్లాపై పూర్తిస్థాయి ఫోక‌స్ పెట్టింది. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ త‌న కంచుకోట‌ను కాపాడుకునేందుకు త‌ప్ప‌నిస‌రిగా, సీనియ‌ర్ నేత‌ల‌ను ఆహ్వానించాల్సిన ప‌రిస్థితి […]

హెడ్ కానిస్టేబుల్ పై చంద్ర‌బాబు దౌర్జన్యం?

ఆర్ నారాయ‌ణ‌మూర్తి ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన హెడ్‌కానిస్టేబుల్ వెంకట్రామ‌య్యపై రాజ‌కీయాలు క‌మ్ముకున్నాయా? సినీ పెద్ద‌ల‌తోపాటు రాజ‌కీయ శ‌క్తులు కూడా సినిమా ప్ర‌ద‌ర్శితం కాకుండా కుట్ర‌లు చేశారా? ఇవే అనుమానాల‌ను హెడ్‌కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య ద‌ర్శ‌కుడు, హీరో వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ సినిమాకు ఆంధ్రాలో ఒక్క థియేట‌ర్ కూడా ఇవ్వ‌లేద‌ని, నైజాంలో 25 థియేట‌ర్లు ఇచ్చార‌ని, ఏపీ ప్ర‌భుత్వం ఇది చూసి త‌లదించుకోవాలి అంటూ ద‌ర్శ‌కుడు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. చిన్న సినిమాల‌కు థియేట‌ర్స్ దొర‌క‌ని దౌర్భాగ్యం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో […]

ఏపీకి కేంద్రం బంప‌ర్ ఆఫ‌ర్‌…క‌ల నెర‌వేరుస్తున్న మోదీ…!

ఎన్నిక‌ల ముందు ఏపీకి అవి చేస్తాం..ఇవి చేస్తాం అంటూ న‌రేంద్ర మోదీ ఎన్నో వాగ్ధానాలు చేశారు. వ‌రాల మూట‌లు విప్పారు. ప్ర‌ధాని పీఠంపై కూర్చున్న త‌ర్వాత ఆయ‌న ఒక్క హామీ కూడా నెర‌వేర్చ‌లేదు. స్పెష‌ల్ స్టేట‌స్‌పై చేతులెత్తేశారు. రాజ‌ధాని నిర్మాణ సాయంపై సైలెంట్‌గా ఉంటున్నారు. ప్ర‌త్యేక ప్యాకేజ్‌తో మ‌మ అనిపించుకున్నారు. అందులోనూ ఒక్క పోల‌వ‌రం హామీ మిన‌హా మిగ‌తావి ఏవేవో ఇచ్చేసి చేతులు దులిపేసుకుంటున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఇక రైల్వే జోన్ సంగ‌తి ఎక్క‌డి వేసిన గొంగ‌ళి అక్క‌డే […]

బ్రేకింగ్‌…. నోట్ల ర‌ద్దులో ఆర్‌బీఐ మ‌రో శుభ‌వార్త చెప్పేసింది….!

బిగ్ బ్రేకింగ్‌.. పండ‌గ త‌ర్వాత పండ‌గ లాంటివార్త చెప్పింది ఆర్‌బీఐ. ఏటీఎమ్‌ల నుంచి విత్ డ్రా ప‌రిమితిని అమాంతంగా పెంచేసింది. ఏటీఎమ్‌ల నుంచి ప్ర‌స్తుత‌మున్న ప‌రిమితి వారానికి 4500 రూపాయ‌లు. ఈ లిమిట్‌ను ఏకంగా రూ.10 వేల‌కు పెంచింది. అంటే, నెల‌కు 40 వేలు విత్ డ్రా చేసుకోవ‌చ్చ‌న్న‌మాట‌. ఇటు, క‌రెంట్ అకౌంట్ ఖాతానుంచి అయితే ఖాతాదారుడు ప్రెజెంట్ ఉన్న‌ 50వేల రూపాయ‌ల ప‌రిమితిని వారానికి ల‌క్ష రూపాయ‌ల‌కు పెంచింది. అంటే, క‌రెంట్ అకౌంట్ ఖాతాదారుడు నెల‌కి […]