శనికి చీర కడితే రోజాలా ఉంటుందట

TDP MLC Buddha Venkanna Sensational Comments on MLA Roja and YS Jagan

శనికి చీర కట్టి జాకెట్టు వేస్తే..అచ్చం రోజాలాగే వుంటుందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కొత్త పల్లవి అందుకున్నారు. కరువుకు ప్యాంట్ షర్ట్ వేస్తే చంద్రబాబులా వుంటాయని రోజా చేసిన వ్యాఖ్యలను వెంకన్న ఖండించారు.  రోజాది ఐరన్ లెగ్ అని అందరికీ తెలుసని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై రోజాతో అబద్ధపు, అసత్యపు మాటలతో దాడి చేస్తున్నారని విమర్శించారు.

అసలు రోజా తన గురించి ఏమనుకుంటుందని ప్రశ్నించారు.రోజా ఏం మాట్లాడిన గట్టిగా మాట్లాడకుండా ఉండటానికి గల కారణం ఆమె అడపిల్లేనని అన్నారు. రోజా ఏంటీ, రోజా పరిస్థితి ఏంటని నిలదీశారు. ఆమె తమ పార్టీలోకి రావడంతో ప్రతిపక్షానికి పరిమితమయ్యామని, తమ పార్టీ నుంచి ఆమె కాంగ్రెస్‌లోకి వెళ్లగానే వైఎస్ ప్రాణాలు కోల్పోయారని, జగన్ జైలుకెళ్లాడని తెలిపారు.

బీష్ముడిపై శిఖండిని వదిలినట్టు చంద్రబాబుపై విమర్శలకు రోజాను జగన్ ప్రయోగిస్తున్నాడని ఆయన ఆరోపించారు. కుటిల రాజకీయాల కోసం జగన్ మహిళలను వాడుకుంటున్నాడని ఆయన విమర్శించారు. రోజా ఇదే ధోరణిలో ఆరోపణలు చేస్తూ పోతే తాము చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు.

Leave a Reply

*