టీడీపీలో ఇద్దరు రోజాలు!

tdp-mlas-fires-on-roja

వైసీపీలో ఒక్కతే రోజా. ఆమె తన భాషతో టీడీపీని కంగాళీ కంగాళీ చేసి….కంపు చేస్తోంది. కానీ ఆమెకు ధీటుగా ఇప్పుడు టీడీపీలో కూడా ఇద్దరు రోజాలు తయారయ్యారనే వ్యాఖ్యలు బయట వినిపిస్తున్నాయి. అందులో మొదటి రోజా బుడ్డా వెంకన్న కాగా, మరొకరు…ఆనం వివేకానంద రెడ్డి. ఆమె ఒకటంటే చాలు…వీళ్లు మూడంటారు. బూతుకు బూతు. పంచ్ కు పంచ్.

ఒకప్పుడు ఇదే రోజాను ఆనం ఏకి పారేశాడు. ఐరన్ లెగ్ దగ్గర్నుండి ఎన్ని అనాలో అన్నీ అనేశాడు. ఇప్పుడు ఎమ్మెల్సీ బుడ్డా వెంకన్న కూడా అంతే. రోజా అయితే ఏంటి?  మహిళ అయితే ఏంటి? దుమ్ము దులపడమే. గట్టిగా సమాధానం చెప్పడమే అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. వాస్తానికి ఈ వెంకన్నను ఒకప్పుడు ఎవ్వరూ పట్టించుకునేవాళ్లు కాదు. కాల్ మనీ తర్వాత ఆయన చాలా ఫేమస్ అయ్యాడు.

ఇక తన నోటి దురుసు ఎక్కువ కావడంతో మీడియా అటెన్షన్ ను బాగానే తన వైపు తిప్పుకున్నాడు. కానీ వైసీపీ ఒక్క రోజా చాలు అన్నట్లుగా ఉన్నారు. ఆమెకు సీఎం, మంత్రి అనే తేడా లేదు. నోటి దురుసుతోనే అందరినీ ఊపేస్తుంటుంది. కొన్ని సార్లు ఆమె మాటల తీరుకు జనమే ముక్కు మీద వేలేసుకుంటారు. అయితేనేం ఏమాత్రం తగ్గడం లేదు. ఇక టీడీపీలో రోజాకు సరైన మహిళలు లేకపోవడంతో మగవాళ్లే రోజాకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.

దీంతో మహిళలకు బదులుగా మగ…రోజాలను తయారు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీళ్లు మాట్లాడితే…అపోజిషన్ ను గౌరవించాల్సిన అవసరం లేదు. పంచ్ కు పంచ్ విసరాల్సిందే.

Leave a Reply

*