జాగృతి కవిత వస్తోందా? జర జాగ్రత్త

MP kavitha

యిప్పుడు హైదరాబాద్ లో ఎక్కడ విన్నా యిదే టాపిక్. హై ఫై సర్కిల్లో కవిత మేటర్ చక్కర్లు కొడుతోంది. గతంలో ఓ నగల దుకాణం ప్రారంభోత్సవానికి అతిథిగా హాజరైన కవిత.. లక్షల రూపాయల నగలు తీసుకెళ్లిందని, తీరా డబ్బులు అడిగితే.. బెదిరించిందని రూఢి కాని రూమర్లు చక్కర్లు కొట్టాయి. ఇది నిజమో కాదో తెలియదు కానీ..ముఖ్యమంత్రి కుమార్తె హోదాలో ఏ కార్యక్రమం జరిగినా నిజామాబాద్ ఎంపీ, జాగృతి అధ్యక్షురాలు కవితను గెస్ట్ గా పిలవడం తప్పనిసరవుతోందని బిజినెస్ పీపుల్ చెబుతున్న మాట.

అయితే కవితను కార్యక్రమానికి పిలిస్తే..తడిసి మోపెడు అవుతోందని వాపోతున్నారట సదరు వ్యాపారవేత్తలు. కానుకలు, అతిథి మర్యాదలు సరేసరి. దీనికితోడు కవిత అతి పెద్ద సైన్యంతో కార్యక్రమానికి దిగుతోందట. అంటే తాను ప్రారంభించే కార్యక్రమం దగ్గర జనం లేకపోతే..తనకు క్రేజ్ లేదనుకుంటారేమోనని, భారీగా జనసమీకరణతో ప్రారంభోత్సవమైనా, జ్వోతి ప్రజ్వలన అయినా హాజరవుతోందట. భారీగా తరలివస్తున్న కవిత అభిమానులు, జాగృతి కార్యకర్తలు, టీ ఆర్ ఎస్ నేతలకు అతిథి మర్యాదలు చేయలేక నిర్వాహకులు తలలుపట్టుకుంటున్నారట.

సాధారణంగా ఫైవ్  స్టార్ హోటల్లు తాము నిర్వహించబోయే కార్యక్రమానికి హాజరయ్యే వారి అంచనాకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తుంటాయి. అయితే ఎంపీ కవిత హాజరయ్యే కార్యక్రమాలకు విపరీతమైన జనం రావడంతో స్టార్ హోటల్ ప్రతినిధులు తలలు పట్టుకుంటున్నారట.

Leave a Reply

*