బాబుకు పట్టిసీమ కష్టాలు

chandrababu pattu seema project

బాబు పట్టుపట్టి కట్టిన పట్టిసీమ అన్ని కష్టాలకు మూలాధారమైంది. కమీషన్ల కోసమే పట్టిసీమ కట్టారని, వందల కోట్లు దండుకున్నారని పట్టిసీమతో తొలి అస్ర్తం సంధించారు వైసీపీ అధినేత జగన్.

ఇదే విషయాన్ని జగన్ పార్టీ సానుభూతిపరుడు ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ధ్రువీకరించారు. పట్టిసీమలో అవినీతిని తాను నిరూపిస్తానని తరచూ మీడియా ముందుకు వస్తుంటారు ఉండవల్లి.

మరోవైపు పట్టిసీమ పోలవరంలో భాగమా కాదా అని ఏపీ బీజేపీ నేతలు బాబును నిలదీస్తున్నారు. పోలవరంలో భాగమే అంటే ఒక తంటా..కాదంటే మరో తంటా వస్తుందని బాబు మౌనం దాల్చారు.

ఇదే మంచి అదను అని వేచి చూస్తున్న తెలంగాణ సర్కారు కూడా జలవివాదాల్లోకి పట్టిసీమను లాగింది. ఆంధ్రప్రదేశ్ కోరుతున్న జలవాటాలను, తెలంగాణ కడుతున్న ప్రాజెక్టులపై లేవనెత్తిన అభ్యంతరాలపై

పట్టిసీమ అస్ర్తం ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. మొత్తానికి ఎన్ని ముహూర్తాలు చూసి చేసిన నదుల అనుసంధానమైన పట్టిసీమ వ్యవహారం బాబును యిప్పట్లో వదిలేలా లేదు.

Leave a Reply

*