Top
Home > రివ్యూస్ > తెలంగాణలో లక్ష దాటిన కరోనా కేసులు

తెలంగాణలో లక్ష దాటిన కరోనా కేసులు

తెలంగాణలో లక్ష దాటిన కరోనా కేసులు
X

హైదరాబాద్‌: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 2,474 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో ‌హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే 447 నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,01,865 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా, వైరస్‌ ప్రభావంతో ఇవాళ ఏడుగురు మృతి చెందగా, మొత్తం మరణించిన వారి సంఖ్య 744కు చేరింది. ఇవాళ 1,768 మంది వైరస్‌ బారి నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లగా, మొత్తం 78,735 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 22,386 మంది మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. ఇంట్లో, ఐసోలేషన్‌ కేంద్రాల్లో 15,931 మంది ఉన్నారు.

గడిచిన 24 గంటల వ్యవధిలో 43,095 మందికి కొవిడ్ -19 ‌పరీక్షలు చేయగా, ఇప్పటి వరకు 8,91,173 మందికి టెస్టులు చేసినట్లు పేర్కొంది. గడిచిన 24 గంటల వ్యవధిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 447, రంగారెడ్డి జిల్లాలో 201, మేడ్చల్‌, మల్కాజ్‌గిరి జిల్లాల్లో 149 కరోనా పాజిటివ్ ‌కేసులు నమోదైనట్లు వివరించింది. భద్రాద్రి కొత్తగూడెంలో 44, ఖమ్మంలో 125, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 123, వరంగల్ ‌గ్రామీణ జిల్లాలో 22 చొప్పున, ఆదిలాబాద్‌ జిల్లాలో 15, జగిత్యాల జిల్లాలో 91, జనగామా జిల్లాలో 20, జోగుళాంబా గద్వాల జిల్లాలో 59, నల్గొండ జిల్లాల్లో 122, కామారెడ్డి జిల్లాల్లో 61, సిద్దిపేట జిల్లాల్లో 92, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 52, పెద్దపల్లి జిల్లాల్లో 79, సూర్యాపేట జిల్లాల్లో 63, నిజమాబాద్‌ 153, మహబూబాబాద్‌ జిల్లాల్లో 59, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 49, నారాయణపేట జిల్లాలో 11, కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 11, మెదక్‌ జిల్లాలో 38, ములుగు జిల్లాలో 15, నిర్మల్‌ జిల్లాలో 19, సంగారెడ్డి జిల్లాలో 72, వికారాబాద్‌ జిల్లాలో 18, వనపర్తి జిల్లాలో 37, యాదాద్రి భువనగిరి జిల్లాలో 28, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 52, మంచిర్యాల జిల్లాలో 53, కరీంనగర్‌ జిల్లాలో 75, కామారెడ్డి జిల్లాలో 61, భూపాలపల్లి జిల్లాలో 19, జగిత్యాల జిల్లాలో 91, ఆదిలాబాద్‌ జిల్లాలో 15 కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.

Updated : 2020-08-26T18:18:14+05:30
Next Story
Share it
Top