హైదరాబాద్, నమస్తే తెలంగాణ: వినాయకచవితి పర్వదినాన్ని కుటుంబసభ్యులతో ఇంట్లోనే ఆనందంగా జరుపుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. మట్టితో తయారుచేసిన సహజసిద్ధమైన గణేశ్ విగ్రహాలను భక్తి ప్రపత్తులతో పూజించాలని కోరారు. వినాయక చవితి ద్వారా బాలగంగాధర్తిలక్ సామూహిక సమావేశాలతో జాతీయవాద భావాలను వ్యాప్తిచేశారని, ప్రస్తుత కొవిడ్ నేపథ్యంలో సామూహిక ఉత్సవాలకు దూరంగా ఉండాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. కరోనా వ్యాప్తి కారణంగా అందరూ ఇండ్లలోనే వినాయకచవితి జరుపుకోవాలని తెలంగాణ అర్చక సమాఖ్య వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ, అర్చక ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు గంగు భానుమూర్తి, శృంగేరి ఆస్థాన వేద పండితుడు పురాణం మహేశ్వరశర్మ, తెలంగాణ బ్రాహ్మణసేవా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు చెన్నంపల్లి జగన్మోహన్శర్మ, ప్రధాన కార్యదర్శి గాడిచెర్ల నాగేశ్వరరావు సిద్ధాంతి, కోశాధికారి విజయసారథి వేర్వేరు ప్రకటనల్లో కోరారు. వినాయక మండపాల ఏర్పాటును ప్రోత్సహించవద్దని ప్రజలకు విజ్ఞప్తిచేశారు.
ఇంట్లోనే వినాయకచవితి ఉపరాష్ర్టపతి పిలుపు
Shailendra | 22 Aug 2020 11:00 AM GMT
X
X
Updated : 2020-08-26T18:18:14+05:30
Next Story
© 2017 - 2018 Copyright Telugu70MM. All Rights reserved.
Designed by Hocalwire