ముంబై, ఆగస్టు 21: రిలయన్స్ కమ్యూనికేషన్స్ చైర్మన్ అనిల్ అంబానీపై దివాలా చర్యలకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆదేశించింది. ఆగస్టు 2016లో రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్), రిలయన్స్ ఇన్ఫ్రాటెల్కు ఎస్బీఐ ఇచ్చిన రుణాలకుగాను అనిల్ అంబానీ వ్యక్తిగత పూచీకత్తుగా ఉన్నారు. దీంతో బకాయిల వసూలుకు ఎస్బీఐ ఎన్సీఎల్టీని ఆశ్రయించగా, రూ.1,200 కోట్లను వసూలు చేయడానికి దివాలా చట్టంలోని వ్యక్తిగత పూచీకత్తు సెక్షన్ కింద రిజల్యూషన్ ప్రొఫెషనల్‌ను నియమిస్తూ ఎన్సీఎల్టీ గురువారం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు తాజా ఆదేశాలను సమీక్షిస్తున్నామని, ఎన్సీఎల్ఏటీలో సవాల్ చేసే అవకాశాలను పరిశీలిస్తున్నామని అంబానీ గ్రూప్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇదిలావుంటే రిజల్యూషన్ ప్రక్రియ నుంచి ఆర్‌కామ్, రిలయన్స్ టెలికం స్పెక్ట్రంను మినహాయించాలని టెలికం శాఖ ఎన్సీఎల్టీలో అఫిడవిట్ దాఖలు చేసింది.
అనిల్‌పై దివాలా చర్యలు
Shailendra | 22 Aug 2020 11:04 AM GMT
X
X
Updated : 2020-08-26T18:27:57+05:30
Next Story
© 2017 - 2018 Copyright Telugu70MM. All Rights reserved.
Designed by Hocalwire