నాని "వి" టాలీవుడ్ మీద ఎలాంటి ప్రభావం చూపబోతుంది?ఇంద్రగంటి మోహన కృష్ణ తనపై ఎలాంటి ఇమేజ్ లు పడకుండా కెరియర్ ని లీడ్ చేస్తున్న దర్శకుడు.. కామెడీ, రోమాన్స్... థ్రిలర్ ఈ జానర్స్ లో సినిమాలు చేసి బేష్ అనిపించుకున్న ప్రతిభావంతుడు..తన మోస్ట్ ఫేవరేట్ నాని తో చేస్తున్న థ్రిల్లర్ విడుదలకు ముందే అంచానాలను పెంచింది.. నాని, సుధీర్ బాబు ల మద్య ఫైట్ ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి ని సినిమా టీం బాగా పెంచింది.. ట్రైలర్ తో ఈ సినిమా టైటిల్ వి ... విక్టరీ గా మారుతుందనే భరోసా ఇచ్చింది... మరి ఓటిటి పైకి నేరుగా వస్తున్న వి నాని కి కి ఎలాంటి ఎక్స్ పీరియన్స్ ని ఇవ్వబోతుందో అనేది ఇప్పటికీ సస్పెన్సే...పెంగ్విన్ నుండి జ్యోతిక పోన్నాంగల్ వందల్ వరకూ ఓటిటి పై పెద్దగా పేఆఫ్ అవలేదు... సరిగ్గా చెప్పాలంటే ఓటిటి పై నేరుగా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అనిపించుకున్నస్టార్ హీరో మూవీ రిలీజ్ సౌత్ లో మూవీ లేదు.. మరి వి తో సమీకరణాలు మారనున్నాయి అని తెలస్తుంది. ఈ ప్రయోగంలో నాని ముందుండబోతున్నాడు. వి తో నేరుగా ఆడియన్స్ ముందుకు వస్తున్న నాని ఓటిటి పై ఎలాంటి ఇంపాక్ట్ ఇస్తాడో ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి. నాని కి థియేటర్ యాక్సపటెన్సీ కి వచ్చిన ఇబ్బంది లేదు.. మినిమమ్ గ్యారెంటీ కార్డ్ తో ఉన్న నాని వి తో ఓటిటి పై పెద్ద చేంజ్ ని తీసుకురాబోతున్నాడనే టాక్ వినిపిస్తుంది. అందులో సుధీర్ బాబు కాంబినేషన్ ఈ ప్రాజెక్ట్ పై మరింత ఆసక్తిని పెంచింది.
దీనితో పాటు అనుష్క నిశ్శబ్దం కూడా అక్టోబర్ మొదటివారంలో ఓటిటి పైకి రాబోతుంది. సూర్య ఆకాశం నీ హాద్దురా కూడా అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తెలుగు, తమిళ బాషల్లో మార్కట్ ఉన్న సూర్య సినిమా ఓటిటి రిలీజ్ అవడం తమిళ ఇండస్ట్రీ లో పెద్ద టాక్ నే సృష్టించింది. డిస్ట్రిబ్యూటర్స్ నుండి ఓత్తిళ్లను కూడా సూర్య ఎదుర్కోన్నాడు. సినిమా ఎక్స్ పీరియన్స్ ని దేనితోనూ పోల్చలేం.. కానీ ఇప్పుడు ఉన్న కరోనా విపత్కర కాలంలో ఇండస్ట్రీ లో వస్తున్న మార్పులు భవిష్యత్ లో ఓటిటి పై బలమైన ముద్రను వేస్తాయి.. ఓటిటి కోసం సినిమాలు చేసే స్టార్స్ ని చూడొచ్చు ...థియేటర్ కి ఓటిటి కి స్పష్టమైన తేడాను ప్రేక్షకులు చూడబోతున్నారు. సబ్ స్క్రిప్షన్ తో పాటు పే ఫర్ వ్యూ లాంటి ఆపష్స్ లో ఎంటర్ టైన్మెంట్ ఉండబోతుంది. వితో నాని డిజిటల్ మీడియా ప్రమోషన్స్ మొదలు పెట్టాడు.. వి సింబల్ చూపిస్తూ సెల్ఫీ దిగి ట్రైలర్ లాంచ్ చేయోచ్చు అని టీం కాంపైన్ మొదలు పెట్టింది. ఓటిటి పై ఒక పెద్ద జర్క్ ఇవ్వబోతున్న నాని తెలుగు ఇండస్ట్రీ లో మొదటి హీరో అవుతాడు. కృష్ట అండ్ హిజ్ లీల ఒకటే ఈ లాక్ డౌన్ లో ఓటిటి పై మెప్పించిన సినిమా గా గుర్తింపు పొందింది. ఇప్పడు వి తో నాని , సుధీర్ బాబు లు ఇచ్చే ఇంపాక్ట్ ఓటిటి కి పెద్ద బూస్టప్ అవుతుంది. థియేటర్స్ రిలీజ్ ను ఎంజాయ్ చేసిన నాని ఓటిటి రిలీజ్ ని ఎలా సెలబ్రేట్ చేసతాడో చూడాలి.