Top
Home > సినిమాలు > మాస్ ని ఎట్రాక్ట్ చేస్తున్న సుధీర్, నానీల వి సినిమా

మాస్ ని ఎట్రాక్ట్ చేస్తున్న సుధీర్, నానీల వి సినిమా

మాస్ ని ఎట్రాక్ట్ చేస్తున్న సుధీర్, నానీల వి సినిమా
X

నేచులర్ స్టార్ నాని, సుధీర్ బాబు హీరోలుగా నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ''వి''. నాని కెరీర్లో 25వ చిత్రంగా వస్తున్న ఈ మూవీలో అదితి రావ్ హైదరి - నివేత థామస్ లు హీరోయిన్స్ గా నటించారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. కరోనా కారణంగా రిలీజ్ ఆగిపోయిన ఈ సినిమాని ఫైనల్ గా వచ్చే నెల 5న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేస్తున్నాడు ప్రకటించారు.

రిలీజ్ కి ఇంకా తక్కువ రోజుల టైమే ఉండటంతో "వి" ట్రైలర్ ని నిన్న రిలీజ్ చేసింది టీమ్. ఈ ట్రైలర్ కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. టీజర్ తోనే ఈ సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చిన టీమ్, ఇక ట్రైలర్ తో అంచనాలను పెంచింది. నాని, సుధీర్ బాబు కాంబినేషన్లో హై ఓల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు. వీరిద్దరి కెరీర్లో ఇదే కంప్లీట్ మాస్ మూవీ అని చెప్పొచ్చు.

ఇక నాని సైకో కిల్లర్ గా కనిపిస్తుంటే...సుధీర్ బాబు విలన్ కోసం వేట కొనసాగించే పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. ఓ సైకో కిల్లర్ - సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కు మధ్య ఛాలెంజింగ్ గా సాగే సినిమా ఇది. ఈ ట్రైలర్ లో ఆదితిరావు పాత్రను రివీల్ చేయలేదు. "వి" చిత్రానికి నేషనల్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందించారు. తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అదరగొట్టాడు. జగపతిబాబు - వెన్నెల కిశోర్ - నాజర్ - అవసరాల శ్రీనివాస్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు నుంచి డిజిటల్ రిలీజ్ కి రెడీ అయిన పెద్ద సినిమా ఇదే కావడం విశేషం.

Updated : 28 Aug 2020 4:21 PM GMT
Tags:    
Next Story
Share it
Top