Top
Home > సినిమాలు > జనవరి నుంచి అనిల్ రావిపూడి F3 ప్రారంభం

జనవరి నుంచి అనిల్ రావిపూడి F3 ప్రారంభం

జనవరి నుంచి అనిల్ రావిపూడి F3 ప్రారంభం
X

టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకరు. కేవలం ఐదు సినిమాలతోనే టాప్ డైరెక్టర్ గా ఎదిగాడు. కమర్షియల్ ఎంటర్టైనర్లుగా తీస్తూనే కామెడీని హైలైట్ చేయడం అనిల్ స్పెషాలిటీ. ఇదే పంథాలో సినిమాలు తీస్తూ ఎదిగాడు. ఆతని దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ ఒకదాన్ని మించి ఒకటి సక్సెస్ అవుతున్నాయి. అనిల్ రావిపూడి మొదటి సినిమాలో హిట్స్ అయితే...ఆ తర్వాత వచ్చిన ఎఫ్2, సరిలేరు నీకెవ్వరూ భారీ కమర్షియల్ హిట్స్ గా నిలిచాయి. వెంకటేష్, వరుణ్ కాంబోలో వచ్చిన ఎఫ్2 150 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధిస్తే...ఆ తర్వాత ఈ ఏడాది రిలీజైన సరిలేరు నీకెవ్వరూ 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. దీంతో అనిల్ టాప్ డైరెక్టర్ గా మారాడు.

అనిల్ రావిపూడి తన తర్వాతి సినిమాగా ఎఫ్2కి సీక్వెల్ గా ఎఫ్3 పేరుతో సినిమాని ప్రకటించాడు. ఈ లాక్ డౌన్ టైమ్ లో స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ చేశాడని తెలుస్తోంది. ఇందులోనూ వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ నటించబోతున్నారు. ఈ చిత్రం వెంకటేష్ కి 75వ చిత్రం. దిల్ రాజు నిర్మించే ఈ సినిమాని వచ్చే ఏడాది జనవరిలో స్టార్ట్ చేయడానికి టీమ్ రెడీ అవుతోంది. అందులో భాగంగా మిగతా టెక్నీషియన్లను, కాస్ట్ అండ్ క్రూని అనిల్ ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు. మరి ఎఫ్3, ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

Updated : 29 Aug 2020 1:47 AM GMT
Tags:    
Next Story
Share it
Top