Top
Home > బాక్స్ ఆఫీస్‌ > 14 రీల్స్ సంస్థలో సురేందర్ రెడ్డి, అఖిల్ మూవీ

14 రీల్స్ సంస్థలో సురేందర్ రెడ్డి, అఖిల్ మూవీ

14 రీల్స్ సంస్థలో సురేందర్ రెడ్డి, అఖిల్ మూవీ
X

Surender Reddy, Akhil Movie in 14 Reels Plus Bannerమెగాస్టార్ చిరంజీవితో సైరా నరసింహారెడ్డి మూవీ తీసి ప్రశంసలు పొందిన సురేందర్ రెడ్డి, ఆ తర్వాత బిగ్ స్టార్స్ తో సినిమాలు చేయడానికి ప్రయత్నించాడు. కానీ వర్కవుట్ కాలేదు. దీంతో కుర్ర హీరో అఖిల్ తో తన కొత్త సినిమాని ఫైనల్ చేసుకున్నాడు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి ఈ సినిమాని పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. ఇక అఖిల్ కూడా మూడు సినిమాలు చేసినా సరైన హిట్ కొట్టలేదు. ఇప్పుడు చేస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో హిట్ కొట్టాలనే ఆశతో ఉన్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో పూజా హెగ్డే హీరోయిన్ గా ఈ చిత్రం రూపొందుతోంది. సినిమాపై పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.

ఇక అఖిల్, సురేందర్ రెడ్డి సినిమా 40 కోట్లకు పైగా బడ్జెట్ తో రాబోతుంది. అంత బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు ముందుకు రావడం లేదనే టాక్ ఆ మధ్య వినిపించింది. కానీ ఇప్పుడు 14 రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతుందని తెలుస్తోంది. డిసెంబర్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు. సురేందర్ రెడ్డి సినిమాలు మాస్ ని ఎట్రాక్ట్ చేసేలా ఉంటాయి. మరి అఖిల్ ని సురేందర్ రెడ్డి ఎలా ప్రజెంట్ చేయబోతున్నాడు చూడాలి.

Updated : 28 Aug 2020 4:30 PM GMT
Next Story
Share it
Top