Top
Home > బాక్స్ ఆఫీస్‌ > విలన్ క్యారెక్టర్లో మిల్కీబ్యూటీ తమన్నా...నిజమేనా...?

విలన్ క్యారెక్టర్లో మిల్కీబ్యూటీ తమన్నా...నిజమేనా...?

విలన్ క్యారెక్టర్లో మిల్కీబ్యూటీ తమన్నా...నిజమేనా...?
X

విలన్ క్యారెక్టర్లో మిల్కీబ్యూటీ తమన్నా...నిజమేనా...?మిల్కీబ్యూటీ తమన్నాహీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్ళు అయ్యింది. ఈ లాంగ్ జర్నీలో తమన్నా ఎక్కువగా గ్లామరస్ రోల్స్ లోనే ఎక్కువగా కనిపించింది. అయినప్పటికీ తన చలాఖీ నటనతో యూత్ తో పాటు అందర్నీ బాగానే మెప్పించి వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్ గానూ కంటిన్యూ అవుతోంది తమన్నా. తమన్నా ఈ మధ్య కాస్త రూట్ మార్చింది. పెద్ద హీరోల సినిమాల ఆఫర్లు తగ్గడంతో మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేస్తోంది. అలాగే లేడీ ఓరియంటెడ్ మూవీస్ లోనూ కనిపిస్తూ తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటోంది. మరోపక్క హిందీ సినిమాల్లో కూడా అప్పుడప్పుడు మెరుస్తోంది.





ఇక మిల్కీబ్యూటీ తమన్నా సైరా నరసింహారెడ్డితో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. చిరంజీవి నటించిన ఈ చిత్రంలో తమన్నా ఓ పవర్ఫుల్ రోల్ లో కనిపించి ప్రశంసలు అందుకుంది. దీంతో అలాంటి పాత్రలు మరిన్ని చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుందని లేటెస్ట్ గా తన కొత్త సినిమాల కమిట్ మెంట్స్ చూస్తే అర్ధమవుతోంది. తమన్నా ఇప్పుడు గోపిచంద్ కి జోడీగా సీటిమార్ లో నటిస్తోంది. ఇది స్పోర్ట్ డ్రామా మూవీతో తెరకెక్కుతోంది. ఇక లేటెస్ట్ గా మురుగదాస్ డైరెక్షన్లో విజయ్ హీరోగా నటించే తుపాకీ సీక్వెల్ లోనూ తమన్నాకి ఆఫర్ వచ్చిందట. అయితే హీరోయిన్ గా కాజల్ నే తీసుకుంటున్నారు. కానీ నెగిటివ్ టచ్ ఉన్న పాత్రకి తమన్నాని తీసుకోబోతున్నారట. ఈ ఛాలెంజింగ్ రోల్ లో నటించడానికి తమన్నా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటున్నారు. మొత్తానికి కొత్త హీరోయిన్ల హవా తట్టుకోవడానికి మిల్కీబ్యూటీ ఇలా ప్రయోగాల బాట పడుతోంది.

Updated : 28 Aug 2020 4:39 PM GMT
Tags:    
Next Story
Share it
Top