Top
Home > బాక్స్ ఆఫీస్‌ > పవన్ కళ్యాణ్ కి జోడీగా పూజా హెగ్డే

పవన్ కళ్యాణ్ కి జోడీగా పూజా హెగ్డే

పవన్ కళ్యాణ్ కి జోడీగా పూజా హెగ్డే
X

పూజా నటించి గత చిత్రాలు మహర్షి, అల వైకుంఠపురములో సినిమాలు సూపర్ హిట్స్ అవ్వడం కూడా పూజా రేంజ్ ని పెంచాయి. పూజా హెగ్డే ఇప్పుడు తెలుగులో కుర్ర హీరో అఖిల్ కి జోడీగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిరల్ మూవీలో చేస్తోంది. ఈ సినిమా చాలా వరకు షూటింగ్ అయిపోయింది. ఇక ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ లోనూ హీరోయిన్ గా చేస్తోంది. 30 శాతం షూటింగ్ కూడా ఫినిష్ అయ్యింది. రాధేశ్యామ్ తెలుగు, హిందీ, తమిళ, మలయాళ బాషల్లో విడుదలకాబోతుంది. కాబట్టి దీని మీద పూజా హెగ్డే చాలా ఆశలు పెట్టుకుంది.

ఈ హాట్ బ్యూటీ హిందీలోనూ బిజీగా ఉంది. ఈ మధ్యే హౌస్ ఫుల్ 4తో కమర్షియల్ హిట్ ని అందుకున్న ఈ భామకి సల్మాన్ ఖాన్ సరసన నటించే ఛాన్స్ వచ్చిందంటున్నారు. ఇప్పుడు తెలుగులో పవన్ కళ్యాణ్ కి జోడీగా నటించబోతుంది పూజా హెగ్డే. ఈ చిత్రానికి దర్శకుడు హరీష్ శంకర్. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో డిజె మూవీ వచ్చింది.

హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ నిర్మాణంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమా రాబోతుంది. పవన్-హరీష్ కాంబోలో గబ్బర్ సింగ్ మూవీ వచ్చి ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. దీంతో ఇప్పుడు రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. సినిమాపై మరింత ఇంట్రెస్ట్ పెంచడానికి హరీష్ శంకర్, హీరోయిన్ గా పూజా హెగ్డేని సెలక్ట్ చేశాడట. పూజా కూడా పవన్ తో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుందని తెలుస్తోంది. నెక్ట్స్ ఇయర్ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుంది.

Updated : 2020-08-28T19:28:04+05:30
Tags:    
Next Story
Share it
Top