Top
Home > బాక్స్ ఆఫీస్‌ > కీర్తి సురేష్ మిస్ ఇండియాకి 11 కోట్లా..?

కీర్తి సురేష్ మిస్ ఇండియాకి 11 కోట్లా..?

కీర్తి సురేష్ మిస్ ఇండియాకి 11 కోట్లా..?
X


స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తోంది. "మహానటి" చిత్రంతో వచ్చిన ఫేమ్ తో ఈ టాలెంటెడ్ హీరోయిన్ కి వరుస పెట్టి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు అనేక ఆఫర్లు వెల్లువెత్తున్నాయి. అలాగే ఇప్పటికే చాలా సినిమాల్లో కీర్తి నటించింది. అయితే ఇప్పుడు కరోనా కారణంగా కీర్తి నటించిన సినిమాలే ఎక్కువగా డిజిటల్ విడుదలకు నోచుకుంటున్నాయి. కీర్తి త్వరలోనే మరో రెండు సినిమాలతో ఓటిటి లవర్స్ ని ఎంటర్టైన్ చేయబోతుంది.

ఈ మధ్యే అమెజాన్ ప్రైమ్ లో "పెంగ్విన్" చిత్రంతో వచ్చి ఆకట్టుకుంది కీర్తి సురేష్. ఇక త్వరలోనే దిల్ రాజు సమర్పణలో నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేసిన గుడ్ లక్ సఖి విడుదల కాబోతుంది. తెలుగు, తమిళ, హిందీలో తెరకెక్కిన గుడ్ లక్ సఖి ఓటిటి రైట్స్ కి 13 కోట్లు దక్కినట్లు ఆ మద్య వార్తలు వచ్చాయి. ఇప్పుడు కీర్తి సురేష్ నటిస్తున్న మరో సినిమా మిస్ ఇండియా రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ 11 కోట్లకు దక్కించుకుందంటున్నారు. మహేష్ కోనేరు నిర్మాణంలో వస్తున్న మిస్ ఇండియాలో జగపతిబాబు, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరి ఈ రెండు సినిమాలతో కీర్తి ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.

Updated : 2020-08-28T21:53:26+05:30
Next Story
Share it
Top