Top
Home > బిగ్ స్టోరీ > ఓటిటిల బాటలో టాలీవుడ్ క్రేజీ మూవీస్

ఓటిటిల బాటలో టాలీవుడ్ క్రేజీ మూవీస్

ఓటిటిల బాటలో టాలీవుడ్ క్రేజీ మూవీస్
X

దేశ వ్యాప్తంగా అన్ లాక్ ప్రక్రియ మొదలైనా థియేటర్లు తెరుచుకునే పరిస్థితులు కనిపించకపోవడంతో క్రేజీ చిత్రాలన్నీ ఓటీటీ బాట పడుతున్నాయి. లాక్ డౌన్ పెట్టే సమయానికి విడుదలకు రెడీగా ఉన్న సినిమాలన్నీ ఇప్పుడు ఓటిటిల బాట పడుతున్నాయి. ఇప్పటికే బాలీవుడ్ .. కోలీవుడ్ కు సంబంధించిన క్రేజీ చిత్రాలన్నీ ఓటీటీల్లో రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు టాలీవుడ్ లో నేచురల్ స్టార్ నాని.. యంగ్ హీరో సుధీర్ బాబు నటించిన `వి` సినిమాతో సందడి మొదలవుతోంది. నాని.. సుధీర్ బాబు నటించిన `వి` చిత్రం సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతోంది. ఓటీటీలో డైరెక్ట్ గా విడుదలవుతున్న తొలి తెలుగు క్రేజీ మూవీ ఇదే కావడంతో, ఈ సినిమా ఫలితంపైనా తొలి రోజు వ్యూస్ పైనా సర్వత్రా చర్చ నడుస్తోంది. ఇప్పటి వరకు ఓటిటిల్లో తెలుగు నుంచి చిన్న సినిమాలు మాత్రమే ఎక్కువగా రిలీజయ్యాయి. కానీ ఇప్పుడు వి సినిమా తర్వాత మిగతా హీరోలు కూడా ఓటిటిల బాట పడతారనే టాక్ వినిపిస్తోంది.

త్వరలోనే మరిన్ని తెలుగు క్రేజీ చిత్రాలు ఓటీటీకి క్యూ కట్టడానికి సిద్ధంగా వున్నాయి. అందులో ఒకటి సాయి ధరమ్తేజ్ నటిస్తున్న సోలో బ్రతుకే సోబెటర్. ఫుల్ లెంగ్త్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న సినిమా ఇది. గ్లామరస్ హీరోయిన్ నభా నటేష్ ఇందులో హీరోయిన్ గా చేస్తోంది. ఆల్ రెడీ ఫస్ట్ సాంగ్ తో మెప్పించిన టీమ్, రీసెంట్ గా మరో లవ్ లీ సాంగ్ తో వచ్చి ఆకట్టుకుంటోంది. ఈ సినిమా జీ5 యాప్ లో అక్టోబర్ నెలలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. ఎనర్జిటిక్ హీరో రామ్ నటిస్తున్న `రెడ్` కూడా ఓటిటిలో రాబోతుందనే వార్త లేటెస్ట్ గా హల్ చల్ చేస్తోంది. ఇస్మార్ట్ శంకర్ తో భారీ మాస్ హిట్ ని అందుకున్న రామ్, ఇప్పుడు రెడ్ మూవీతో మళ్ళీ మాస్ ఆడియన్స్ టార్గెట్ గానే వస్తున్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నివేదా పేతురాజ్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటించారు. టీజర్, మేకింగ్ వీడియోలతో రెడ్ పై ఇంట్రెస్ట్ పెరిగింది. ఈ రెడ్ మూవీ డిస్నీ హాట్ స్టార్ లో విడుదలయ్యే ఛాన్స్ ఉంది.

ఇక అనుష్క నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ `నిశ్శబ్దం` మూవీ కూడా ఓటిటికి రెడీ అవుతోంది. నిజానికి ఈ వారం రెండు మూడు నెలలుగా వినిపిస్తోంది. కానీ ఇంత వరకు వర్కవుట్ అవ్వలేదు. ఫైనల్ గా నిశ్శబ్దం అక్టోబర్ లో డిజిటల్ రిలీజ్ కి రెడీ అవుతోంది. మాధవన్, షాలినీ, అంజలీ కీలక పాత్రలు పోషించిన నిశ్శబ్దం సినిమా నెట్ ఫ్లిక్స్ లో విడుదలకు సిద్దమవుతుందని తెలుస్తోంది. ఈ మీడియం రేంజ్ సినిమాలతో పాటు చిన్న సినిమాలు మరిన్ని ఓటిటిలో రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. అలాంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుహాస్ హీరోగా పరిచయం అవుతున్న `కలర్ ఫొటో` ఒకటి. ఈ సినిమా టీజర్ అందర్నీ మెప్పించింది. కలర్ ఫోటో ఆహాలో రిలీజ్ కాబోతుంది. అయితే రిలీజ్ కి రెడీగా ఉన్న రవితేజ క్రాక్, మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఫస్ట్ మూవీ ఉప్పెన వంటి చిత్రాలు ఓటిటికి కాకుండా, లేట్ అయినప్పటికీ ధియేటర్లలోనే వస్తాయంటున్నారు. మొత్తంగా ధియేటర్లు ఓపెన్ కాకపోయినా ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ మాత్రం కంటిన్యూగా అందబోతుంది.

Updated : 2020-09-05T06:08:59+05:30
Tags:    
Next Story
Share it
Top