మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ మూవీ తర్వాత ఎవరితో సినిమా చేయబోతున్నాడనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఇండస్ట్రీలో చాలా పేర్లు తెరపైకి వస్తున్నప్పటికీ, అవేవి కన్ ఫామ్ కావు. చరణ్ నెక్ట్స్ సినిమాకి దర్శకులంటూ నిన్న మొన్నటి వరకు కొరటాల, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి వంటి పేర్లు తెరపైకి వచ్చాయి.
రీసెంట్ గా రామ్ చరణ్ కి ఇద్దరు దర్శకులు స్టోరీ చెప్పారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. వారిలో జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఒకరు. అలాగే అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. వీరిద్దరూ చరణ్ కి స్టోరీ చెప్తే, బాగుంది ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పినట్లు తెలుస్తోంది. మరి వీరిద్దరిలో ఎవరికి ముందు చాన్స్ ఇస్తాడో చూడాలి.
Updated : 29 Aug 2020 10:33 AM GMT
Next Story